మహబూబ్‌నగర్ క్రీడలు: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో వచ్చేనెల 1 నుంచి జూన్ 7వ తేదీ వరకు జిల్లాలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ప్రారంభం కానున్నాయి. ఈ శిబిరాల ఏర్పాటు కోసం జిల్లా యువజన, క్రీడలశాఖ దరఖాస్తులు ఆహ్వానించగా పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, సీనియర్ క్రీడాకారులు శిబిరాలు నిర్వహించడానికి దరఖాస్తులు అందజేశారు. జిల్లాలో ఈ ఏడాది 24 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 10, అర్బన్‌లో 14 చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. ఉదయం 6 నుంచి 8.30 గంటల వరకు శిబిరాలు కొనసాగనున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో శిక్షణ శిబిరం నిర్వాహకులకు (కోచ్‌లు) స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ తరపున రూ.4 వేల గౌరవ వేతనం అందించనున్నారు.
ఎక్కడెక్కడంటే..
గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ఎం.మల్లేష్– కబడ్డీ, జి.నరేష్– బ్యాడ్మింటన్ (అల్లీపురం), శ్రీకాంత్– అథ్లెటిక్స్ (మహమ్మదాబాద్), జి.రాఘవేంద్ర– సాఫ్ట్‌బాల్ (కొత్లాబాద్), ఎం.జంగయ్య– వాలీబాల్ (రాజాపూర్), డి.చరణ్– హ్యాండ్‌బాల్ (వస్పుల), ఎం.విజయ్– హ్యాండ్‌బాల్ (నల్లకుంటతండా), కనకప్ప– వాలీబాల్ (కోయిల్‌సాగర్), ఎస్.లింగం– అథ్లెటిక్స్ (పోతులమడుగు), నరేష్ కాట్రావత్– ఫెన్సింగ్ (దేవునిగుట్టతండా)లో ఏర్పాటు చేయనున్నారు.
● అర్బన్ పరిధిలో జిల్లాకేంద్రం మెయిన్ స్టేడియంలో సునీల్‌కుమార్– అథ్లెటిక్స్, ఎం.రాజగోపాల్– బ్యాడ్మింటన్, ఎండీ ఖలీల్– బాస్కెట్‌బాల్, డి.నికేష్– ఫుట్‌బాల్, వి.శంకర్– బాక్సింగ్, ప్రదీప్‌కుమార్– హ్యాండ్‌బాల్, ఎం.బాలమణి– యోగా, నాగరాజు– సాఫ్ట్‌బాల్, పర్వేజ్‌పాష– వాలీబాల్, అబ్దుల్ రహెమాన్‌ఖాన్– వాలీబాల్ (క్రిస్టియన్‌పల్లి), ప్రణయ్‌కుమార్– హ్యాండ్‌బాల్ (మహబూబ్‌నగర్ హైస్కూల్, భగీరథకాలనీ), అబ్దుల్ ఫయూం– అథ్లెటిక్స్ (క్రిస్టియన్‌కాలనీ), వడెన్న– ఫుట్‌బాల్ (జడ్చర్ల), ఎం.శంకర్‌నాయక్– కబడ్డీ (బాలానగర్)లో కొనసాగనున్నాయి.
కోచ్‌లకు దిశానిర్దేశం
మెయిన్ స్టేడియంలోని జిల్లా యువజన, క్రీడల కార్యాలయంలో సోమవారం వేసవి క్రీడా శిక్షణ శిబిరాలపై కోచ్‌లతో డీవైఎస్‌ఓ సన్నాహక సమావేశం నిర్వహించి కోచ్‌లకు దిశానిర్దేశం చేశారు. శిబిరాల్లో సమయపాలన పాటించాలని, వేసవి తాపం దృష్ట్యా శిక్షణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఆయా క్రీడల కోచ్‌లు సునీల్‌కుమార్, ఎండీ ఖలీల్, రహెమాన్, అంజద్, నికేష్, శంకర్, రాజ్‌గోపాల్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా యువజన, క్రీడాశాఖ ఆధ్వర్యంలో 24 శిక్షణ శిబిరాలు
అర్బన్‌లో 14, గ్రామీణ ప్రాంతాల్లో 10 చొప్పున ఏర్పాటు
మే 1 నుంచి జూన్ 7 వరకు నిర్వహణ


