అవకాశాలను అందిపుచ్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అవకాశాలను అందిపుచ్చుకోవాలి

Apr 27 2026 8:00 AM | Updated on Apr 27 2026 8:00 AM

అర్ధ సెంచరీలతో

ఆకట్టుకున్న బ్యాటర్లు

మహారాష్ట్రపై కర్ణాటక

పాండిచ్చేరిపై తెలంగాణ ఘన విజయం

నేటి మ్యాచ్‌లు

నిర్వహణలో లోటుపాట్లు..

రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి

చదువు, క్రీడల్లో యువత రాణించాలి : ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పిలుపు

అట్టహాసంగా 69వ జాతీయ ఎస్‌జీఎఫ్‌ అండర్‌–17 క్రికెట్‌ టోర్నీ ప్రారంభం

తొలిరోజు శుభారంభం చేసిన

తెలంగాణ జట్టు

ఆకట్టుకున్న చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు

జడ్చర్ల టౌన్‌: యువత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని క్రికెట్‌లో రాణించాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం జడ్చర్ల మినీ స్టేడియంలో నిర్వహించిన 69వ జాతీయ ఎస్‌జీఎఫ్‌ అండర్‌–17 బాలుర క్రికెట్‌ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గత మూడేళ్లుగా జాతీయ టోర్నీ నిర్వహించేందుకు ఏ రాష్ట్రం ముందుకు రాలేదని, అలాంటిది జడ్చర్ల నియోజకవర్గంలో నిర్వహించడం గర్వంగా ఉందని, ఇందుకు ముందుకు వచ్చిన విద్యాశాఖను అభినందించారు. టోర్నీ నిర్వహణకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని పేర్కొన్నారు. క్రికెట్‌, ఇతర ఏ క్రీడ అయినా ఫ్యాషన్‌గా తీసుకుని ముందుకు సాగాలని, తద్వారా అనేక అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయన్నారు. ఇదే సమయంలో క్రీడలతోపాటు చదువుకు ప్రాధాన్యత ఇవ్వడం విస్మరించరాదన్నారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా దృష్టిసారించారన్నారు. ప్రారంభ కార్యక్రమానికి క్రీడల మంత్రి వాకిటి శ్రీహరి హాజరు కావాల్సి ఉండగా.. ఖేలో ఇండియాలో పాల్గొనడానికి వెళ్లినందున రాలేకపోయారని చెప్పారు. అంతకు ముందు డీఈఓ ప్రవీణ్‌కుమార్‌, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి శారద, ఎంఈఓ మంజులాదేవి ప్రసంగించారు. టోర్నీ ప్రారంభం సందర్భంగా క్రీడాకారులతో మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.

77 పరుగుల తేడాతో తమిళనాడు విజయం

రెండో మ్యాచ్‌లో తమిళనాడు ఎన్‌వీఎస్‌ జట్లు పోటీ పడగా తమిళనాడు 77 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న తమిళనాడు జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. జట్టులో ధీరజ్‌ 14 బంతుల్లోనే 51 పరుగులు చేయగా ధరినేష్‌ 31 బంతుల్లో 41 పరుగులు చేశాడు. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎన్‌వీఎస్‌ జట్టు 8 వికెట్లు కోల్పోయి కేవలం 82 పరుగులు చేసింది. జట్టులో ఆర్యన్‌ 32 బంతుల్లో 28 పరుగుల అత్యధికంగా చేయగా బౌలింగ్‌లో రిసిమ్‌ 3 వికెట్లు తీశాడు.

ఏపీపై కేరళం బోణి

ఆంధ్రప్రదేశ్‌– కేరళం జట్ట మధ్య జరిగిన మ్యాచ్‌లో కేరళం జట్టు గెలుపు బోణి కొట్టింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆంధ్రప్రదేశ్‌ నిర్ణీత 15 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది. 98 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళం జట్టు 6 వికెట్లు కోల్పోయి 103 పరుగులు సాధించి 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే రెండు జట్లలోనూ బౌలర్లు రాణించడం విశేషం. ఆంధ్ర జట్టులో అభిమన్యు 4 వికెట్లు తీయగా కేరళం జట్టులోనూ సంకేత్‌ 4 వికెట్లు తీశాడు.

ఉత్తరాఖండ్‌ గెలుపు

ఉత్తరాఖండ్‌– ఐబీఎస్‌ఎస్‌ఓ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్‌లో ఉత్తరాఖండ్‌ ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న జట్టు 10 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. శ్లోక్‌ 20 బంతుల్లో 40 పరుగులు చేయగా బౌలింగ్‌లో అరవ్‌, ఉదయ్‌విర్‌ చెరో 3 వికెట్లు తీశారు. 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఐబీఎస్‌ఎస్‌ఓ జట్టు 79 పరుగులకే ఆలౌట్‌ అయ్యింది. బ్యాటింగ్‌లో వన్ష్‌ఉంగ్లే 24 పరుగులు చేయగా బౌలింగ్‌లో ఆరుష్‌ 3 వికెట్లు తీశాడు.

మధ్యప్రదేశ్‌ విజయం

గుజరాత్‌– మధ్యప్రదేశ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ జట్టును విజయం వరించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన గుజరాత్‌ 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. జట్టులో ఆదిత్యగుప్తా 42 బంతుల్లో 52 పరుగులు చేశాడు. మధ్యప్రదేశ్‌ జట్టులో ప్రియావరాత్‌ 2 వికెట్లు పడగొట్టాడు. మధ్యప్రదేశ్‌ 4 వికెట్లు కోల్పోయి కేవలం 10 ఓవర్లలోనే 130 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. జట్టులో ప్రియావరాత్‌ 28 బంతుల్లోనే 50 పరుగులు చేశాడు.

30 పరుగుల తేడాతో ఉత్తరప్రదేశ్‌..

మహబూబ్‌నగర్‌ బీఎస్‌ఆర్‌ గ్రౌండ్‌లో జరిగిన ఉత్తరప్రదేశ్‌– ఛత్తీస్‌గడ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన ఉత్తరప్రదేశ్‌ నిర్ణీత 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. జట్టులో ఓంప్రియ 36 బంతుల్లో 67 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో విష్ణు 2 వికెట్లు తీశాడు. 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చత్తీస్‌ఘడ్‌ జట్టు 8 వికెట్లు కోల్పోయి 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులో అన్‌మోల్‌ 39 పరుగులు చేయగా బౌలింగ్‌లో అలోక్‌జన్‌ 2 వికెట్లు తీశాడు.

తమిళనాడు– ఎన్‌వీఎస్‌ జట్ల మధ్య మ్యాచ్‌

జాతీయ క్రికెట్‌ టోర్నీలో మొదటిరోజు నలుగురు బ్యాట్స్‌మెన్లు అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. వీరంతా అటు బౌలింగ్‌లోనూ రాణించడం విశేషం. తెలంగాణ– పాండిచ్చేరి జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పాండిచ్చేరికి చెందిన జీవిత్‌ బౌలింగ్‌లో 2 వికెట్లు పడగొట్టగా బ్యాటింగ్‌లో 29 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అయితే జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఇక ఏపీ– కేరళం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కేరళంకు చెందిన అభిమన్యు బౌలింగ్‌లో 4 వికెట్లు తీశాడు. గుజరాత్‌– మధ్యప్రదేశ్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇరు జట్లలో అర్ధ సెంచరీలు నమోదయ్యాయి. గుజరాత్‌ జట్టులో ఆదిత్యగుప్తా 42 బంతుల్లో 52 పరుగులు చేయగా మధ్యప్రదేశ్‌ జట్టులో ప్రియావరాత్‌ 28 బంతుల్లోనే 50 పరుగులు చేసి జట్టు విజయానికి దోహదపడ్డాడు. తమిళనాడు జట్టుకు చెందిన ధీరజ్‌ 14 బంతుల్లోనే 51 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. కర్ణాటక జట్టులోనూ శ్రీజేష్‌ 38 బంతుల్లో 65 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఉత్తరప్రదేశ్‌జట్టులో ఓంప్రియ 36 బంతుల్లోనే 67 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆదివారం జరిగిన మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసింది సైతం ఇతడే.

కర్ణాటక– మహారాష్ట్ర జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 26 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న జట్టు 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేయగా శ్రీజేష్‌ 38 బంతుల్లో 65 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో ధృవీ 2 వికెట్లు పడగొట్టాడు. 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మహారాష్ట్ర 106 పరుగులకే కుప్పకూలింది.

క్రికెట్‌ టోర్నీలో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. పాండిచ్చేరి జట్టుతో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో రాష్ట్ర జట్టు ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న తెలంగాణ జట్టు నిర్ణీత 15 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. కేతన్‌ 29 బంతుల్లో 42 పరుగులు చేయగా, సిద్ధార్థ్‌ 22 పరుగులు చేశా రు. జీవిత్‌ 2 వికెట్లు పడగొట్టాడు. 123 పరు గుల లక్ష్యంతో దిగిన పాండిచ్చేరి జట్టు 14.3 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. జట్టులో జీవిత్‌ 29 బంతుల్లో 50 పరుగులు చేసినా ప్రయోజనం లేకపోయింది. బౌలింగ్‌లో దేవా, రాంచరణ్‌ చెరో రెండు వికె ట్లు పడగొట్టారు. దీంతో 18 పరుగుల తేడాతో తెలంగాణ జట్టు విజయం సాధించింది.

జడ్చర్ల మినీ స్టేడియం

గుజరాత్‌– పంజాబ్‌

జమ్మూకశ్మీర్‌– సీబీఎస్‌ఈ

(డబ్ల్యూఎస్‌ఓ)

యూపీ– డీహెచ్‌ఎన్‌డీడీ

జడ్చర్ల స్వామినారాయణ

గురుకులం మైదానం

పాండిచ్చేరి– బిహార్‌

ఐపీఎస్‌సీఈ– కర్ణాటక

ఎన్‌వీఎస్‌– ఢిల్లీ

మహబూబ్‌నగర్‌

సమర్థ గ్రౌండ్‌

ఒడిశా– సీఐఎస్‌సీఈ

ఆంధ్రప్రదేశ్‌– రాజస్థాన్‌

మహారాష్ట్ర– హర్యానా

మహబూబ్‌నగర్‌

బీఎస్‌ఆర్‌ గ్రౌండ్‌

తెలంగాణ– సీబీఎస్‌ఈ

మధ్యప్రదేశ్‌– కేవీఎస్‌

డీఏ– గోవా

మహబూబ్‌నగర్‌

ఎండీసీఏ గ్రౌండ్‌

సీజీ– ఝార్ఖండ్‌

తమిళనాడు– సీబీఎస్‌ఈ

తెలంగాణ– చండీఘడ్‌

జాతీయ టోర్నమెంట్‌ నిర్వహణలో కొన్ని లోటుపాట్లు కనిపించాయి. మ్యాచ్‌లు ఆడుతున్న మైదానాల్లో మైక్‌ లేకపోవడం పట్ల క్రీడాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే కామెంటరీ సైతం లేకపోవడంతో మ్యాచ్‌లో ఎన్ని పరుగులు, ఎన్ని ఓవర్లు, ఎవరు గెలిచారు అన్న వివరాలు తెలుసుకునేందుకు ఇబ్బందిగా మారింది. మ్యాచ్‌లు ముందుగా 20 ఓవర్లుగా ప్రకటించినప్పటికీ 15 ఓవర్లకు కుదించారు. ఇక భోజనాలు సైతం అంతగా బాగోలేవని క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement