రోడ్డు ప్రమాదంలో బాలుడు దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బాలుడు దుర్మరణం

Apr 27 2026 8:00 AM | Updated on Apr 27 2026 8:00 AM

ఉప్పునుంతల: మండలంలోని శ్రైలం–హైదరాబాద్‌ ప్రధాన రోడ్డులో అయ్యవారిపల్లి స్టేజీ వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో అమ్రాబాద్‌ మండలం బీకే తిర్మలాపూర్‌కు చెందిన జటగోని రాజేష్‌(15) ఏళ్ల బాలుడు అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీకే తిర్మలాపూర్‌ చెందిన మృతుడు రాజేష్‌తోపాటు అదే గ్రామానికి చెందిన మరో బాలుడు జటగోని శివాజీ ఇద్దరు కలిసి బైక్‌పై డిండివైపు వెళ్తున్నారు. వీరి ముందు మరో బైక్‌పై నల్గొండ జిల్లా డిండి మండలం తవకలాపూర్‌ సమీపంలోని తండాకు చెందిన ధర్మనాయక్‌ వెళ్తూ అయ్యవారిపల్లి స్టేజీ సమీపంలోని స్పీడ్‌ బ్రేకర్‌ వద్ద బైక్‌ స్లో చేశాడు. అది గమనించకుండా వేగంగా వెనకనుంచి బైక్‌పై వస్తున్న బాలుడు ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొని పక్కనే ఉన్న హోటల్‌కు సంబంధించిన బోర్డుకు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి తండ్రి జటగోని అంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.

పాముకాటుతో

మహిళా రైతు మృతి

కృష్ణా: పాము కాటుతో మహిళా రైతు మృతి చెందిన ఘటన మండలంలోని గుడెబల్లూర్‌ చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొల్ల మహాదేవి (56) శనివారం ఉదయం రోజు మాదిరిగానే పొలానికి వెళ్లింది. పనులు ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తుండగా ఆమెను పాము కాటు వేసింది. విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు బాధిత మహిళను వెంటనే మక్తల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మృతురాలికి భర్త భీంషప్పతో పాటు కుమార్తె, కుమారుడు ఉన్నారు. వారిది ఇరుపేద రైతు కుటుంబమని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు విజ్ఞిప్తి చేశారు.

తప్పిన ప్రమాదం

గద్వాల క్రైం: ప్రమాదవశాత్తు కారు ఇంజిన్‌లో మంటలు వ్యాప్తించిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. బాధితుడు, ఫైర్‌ సిబ్బంది కథనం మేరకు.. మల్దకల్‌ మండలం మేకలసోంపల్లికి చెందిన హరినాథ్‌గౌడ్‌ కుటుంబ సభ్యులతో కలసి ఎర్రవల్లి నుంచి గద్వాల వైపునకు కారులో వస్తున్నారు. అయితే పూటాన్‌పల్లి స్టేజీ సమీపంలో కారు ఇంజన్‌ నుంచి మంటలు వ్యాపించాయి. గమనించిన యజమాని కారును సైడ్‌కు తీసుకెళ్లి నిలిపివేశాడు. మంటలు వ్యాప్తి చెందడంతో ఫైర్‌ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. దీంతో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులకు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. దీంతో ఊపిరీ పీల్చుకున్నారు.

ట్రాక్టర్‌, బైక్‌ ఢీకొని

యువకుడి మృతి

ఊట్కూరు: మండలంలోని నాగిరెడ్డిపల్లిలో ట్రాక్టర్‌, బైక్‌ను ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ప్రమాదానికి సంబంధించి ఎస్‌ఐ రమేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి కుమ్మరి బాలప్ప (27) సొంత పనులపై బైక్‌పై మల్లేపల్లికి వెళ్లాడు. అక్కడ పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా గ్రామ శివారులోని కుమ్మరి బస్వరాజ్‌ పొలం వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొట్టడంతో బాలప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదంపై భార్య సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి కుమార్తె ఉన్నాది.

Advertisement
 
Advertisement
Advertisement