రిక్కితేజ్‌లో అసాధారణ ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రిక్కితేజ్‌లో అసాధారణ ప్రతిభ

Apr 27 2026 8:00 AM | Updated on Apr 27 2026 8:00 AM

వంగూరు: చిన్న వయసులోనే చిత్రకారుడు రిక్కి తేజ 100కుపైగా చార్‌కోల్‌ చిత్రాలు గీసి అసాధారణ ప్రతిభ కనబరిచాడు. అతను గీసిన అనేక చిత్రాలు ఎంతోమందిని ఆకర్శిస్తున్నాయని సినీ దర్శకుడు, చిత్రకారుడు నర్సింగరావు అన్నారు. వంగూరు మండలం తుమ్మలపల్లి ప్రాథమిక పాఠ శాలలో 8వ తరగతి చదువుతున్న రిక్కితేజ గీసిన చిత్రాలకు సంబంధించి ఎగ్జిబిషన్‌ను హైదరాబాద్‌లోని లమాకాన్‌ వేదికగా ఆదివారం ప్రదర్శించగా.. రిక్కితేజ్‌ గీసిన చిత్రాల్లో ముసలి రైతు చిత్రం తనకెంతో నచ్చిందని నర్సింగరావు పేర్కొన్నారు. అలాగే అతను గీసిన చిత్రంలో కళ్లలో జీవం, చర్మంలోని ముడతలు, ముఖంపై చెమట చుక్కలను గీసిన విధానం పట్ల ఆయన రిక్కితేజను ప్రశంసించారు. పౌరాణిక చిత్రాలు, పోట్రేట్‌లు ఎలాంటి గీతల ఆధారం లేకుండా గీయడం రిక్కితేజ ప్రత్యేకత అన్నారు. ఈ ప్రతిభ వల్ల రిక్కితేజకు వచ్చే ఆదాయంతో తాను చదువుతున్న పాఠశాలలో ప్రతిరోజు అల్పాహారం, స్నాక్స్‌ అందించడం అభినందనీయమన్నారు. ఇలాంటి చిత్రకారులను ప్రభుత్వం ప్రోత్సహించాలని ఆయన కోరారు.

రిక్కితేజ గీసిన వృద్ధ రైతు, యువతి చిత్రాలు

సినీ దర్శకుడు నర్సింగరావు

Advertisement
 
Advertisement
Advertisement