భూత్పూర్: రైతులకు అందుబాటులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని, ఇందుకు సంబంధించి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేస్తున్నట్లు ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. ఆదివారం భూత్పూర్ పట్టణంతోపాటు మండలంలోని కొత్తమొల్గర, పాత మొల్గర, ఎల్కిచర్ల గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గన్నీ బ్యాగులు, రవాణా సౌకర్యం కల్పించడం జరుగుతుందని, సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నట్లు వెల్లడించారు. కాబట్టి రైతులు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయించి నష్టపోరాదని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బాలకోటి, నాయకులు విజయ్‌గౌడ్, వెంకట్ నర్సింహారెడ్డి, ఏఓ మురళీధర్, సర్పంచులు ఆనంద్‌రెడ్డి, రమేష్, వెంకటేష్, సుశీల తదితరులు పాల్గొన్నారు.


