జాతీయ షూటింగ్‌బాల్‌లో ముగ్గురు పాలమూరు క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

జాతీయ షూటింగ్‌బాల్‌లో ముగ్గురు పాలమూరు క్రీడాకారులు

Apr 26 2026 2:51 AM | Updated on Apr 26 2026 2:51 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అనంతపూర్‌లో ఆదివారం నుంచి ఈనెల 28 వరకు జరిగే సౌత్‌జొన్‌ జాతీయస్థాయి సబ్‌ జూనియర్‌ షూటింగ్‌బాల్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు వరుణ్‌, మేఘన, సంగీత పాల్గొంటున్నారు. వీరిని శనివారం జిల్లా కేంద్రంలో మహబూబ్‌నగర్‌ షూటింగ్‌ బాల్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు అభినందించి శాలువాలతో సత్కరించారు. వారు మాట్లాడుతూ క్రీడాకారులు ఈ ఏడాది జనవరిలో తాండూర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి సౌత్‌జోన్‌ జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లో ప్రతిభచాటాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది వి.మనోహర్‌రెడ్డి, మహబూబ్‌నగర్‌ షూటింగ్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు ఆడమ్స్‌, పుష్ప, కోశాధికారి రవి, ఇంద్రసేనారెడ్డి, వెంకట్‌రెడ్డి, డాక్టర్‌ విజయ్‌ మోహన్‌గౌడ్‌, బస్వరాజ్‌, వెంకటేశ్‌, రమేష్‌, జానకిరాములు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement