బిజినేపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని లట్టుపల్లిలో పట్టుబడిన 101 క్వింటాళ్ల బియ్యంలో 73 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ హేమ్లానాయక్ తెలిపారు. బిజినేపల్లి స్టాక్ పాయింట్ నుంచి వచ్చిన నిల్వల్లో లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేశారు. కాగా కొందరు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయలేదని, వాటిని అక్రమ నిల్వ చేశారని అధికారులు చెబుతున్నారు. 73 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని వాటిని బిజినేపల్లి స్టాక్ పాయింట్‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. అక్రమ నిల్వపై కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు. రేషన్ దుకాణం–355 ద్వారా పంపిణీ చేయాల్సిన మిగిలిన బియ్యాన్ని అదే గ్రామానికి చెందిన రేషన్ డీలర్ శ్యామలకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు.


