లింగాల: మండల రేంజ్ పరిధిలోని దారారం బీట్‌లోని ఓ వ్యవసాయ పొలం చుట్టూ ఏర్పాటు చేసిన ఉచ్చులో చుక్కల దుప్పి చిక్కుకొని చనిపోయిన ఘటన శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. మూడు రోజుల క్రితం ఈ వ్యవసాయ పొలం చుట్టూ అటవీ జంతువుల వేటకోసం ఉచ్చును ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కాగా చుక్కల దుప్పి మృతిచెందిన విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటన బయట పడకుండా దుప్పిని కాల్చివేసినట్లు తెలిసింది. కాగా నల్లమల అటవీ ప్రాంతంలో ఇలాంటి ఘటనలో జరుగుతున్నప్పటికీ వెలుగులోకి రాకుండా చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చుక్కల దుప్పి మృతి ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. వివరణ కోరేందుకు ప్రయత్నించగా అటవీశాఖ వారు అందుబాటులో లేరు.
బల్మూర్‌లో పిచ్చికుక్కల సైర్యవిహారం
● ఒకే రోజు ఎనిమిదికి కాటు
బల్మూర్: మండల కేంద్రంతో పాటు కొండనాగులలో శనివారం పిచ్చి కుక్కల సైర్యవిహారం చేశారు. ఒక్కరోజులోనే ఎనిమిది మందిపై దాడి చేశాయి. మండల కేంద్రంలోని ఎస్సీకాలనీ, 1వ వార్డులలో బాలయ్య, రత్నమ్మ, నాగమణి, శివకుమార్, పవన్‌కుమార్, సాయి, ధర్మతేజతో పాటు కొండనాగుల మణికంఠలపై కుక్కకాటు గురై గాయపడ్డారు. బాధితులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఇప్పటికై నా పంచాయతీ సిబ్బంది స్పందించి కుక్కలను అటవి ప్రాంతాలకు తరలించాలని గ్రామస్తులు, బాధితులు కోరుతున్నారు.
కోనేరులో ఇద్దరు చిన్నారులపై దాడి...
అలంపూర్ రూరల్: గద్వాల జిల్లా కోనేరులో శనివారం ఇద్దరు చిన్నారులపై ఓ వీధి కుక్క దాడి చేసింది. అలంపూర్ మండలంలోని ముక్కాపూర్ గ్రామానికి చెందిన తిమ్ములమ్మ, స్వాముల తన కుమారుడు జీవన్‌బాబు (6) కుమార్తె మధుకుమారి (4) కలిసి కోనేరు గ్రామానికి వచ్చారు. చిన్నారులపై కుక్క దాడి చేయగా.. జీవన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అంబులెన్స్‌లో బాలుడిని కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. అక్కడ చికిత్స చేయిస్తున్నారు.


