పెద్దకొత్తపల్లి: జీవాల మేతకోసం గొర్రెల కాపారులకు అటవీ భూములను కేటాయించాలని యాదవ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డా.అజయ్‌కుమార్ యాదవ్ అన్నారు. శనివారం మండలంలోని చెన్నపురావుపల్లిలో యాదవ జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో కురుమ, యాదవుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ అమలు కాలేదన్నారు. బీసీ సర్పంచులు ఉన్న గ్రామాల్లో బీపీ మండల్ విగ్రహాలను ఏర్పాటు చేసి బీసీలనంతా ఏకం చేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో యాదవులకు ఒక మంత్రి పదవి కూడా ఇవ్వకుండా యాదవులను అవమానపర్చి మోసం చేసిందన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో యాదవులు అత్యధిక శాతం ఉన్నారని వచ్చే ఎన్నికలల్లో సంఘటితంగా ఉండి అన్నిపార్టీల వారికి బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో యాదవ జేఏసీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్, జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటస్వామి, మాజీ జెడ్పీటీసీ వెంకటయ్య, వెంకటస్వామి, శ్రీనివాస్‌యాదవ్, మల్లేష్‌యాదవ్ పాల్గొన్నారు.


