నగరంలో తాగునీటి సమస్య రావొద్దు | - | Sakshi
Sakshi News home page

నగరంలో తాగునీటి సమస్య రావొద్దు

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: నగరంలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పి.రామాంజులరెడ్డి ఆదేశించారు. శనివారం మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బందితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వేసవి కావడంతో మిషన్‌ భగీరథ పథకం ద్వారా రెండు రోజులకోసారి సరఫరా అయ్యే తాగునీటిలో ఎలాంటి అవాంతరాలు రాకుండా, అలాగే వృథా కాకుండా చూడాలన్నారు. ముఖ్యంగా పైపులైన్లకు ఎక్కడైనా లీకేజీలు ఏర్పడితే వెంటనే బాగు చేయాలన్నారు. అవసరమైతే ప్రత్యామ్నాయంగా పవర్‌ మోటార్ల ద్వారా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

జనాభా గణనపై అవగాహన

నగర ప్రజలకు జనాభా గణనకు సంబంధించి సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌పై అవగాహన కల్పించాలని మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ పి.రామాంజులరెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం వార్డు ఆఫీసర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెప్మాకు చెందిన ఆర్‌పీల సహాయంతో మొబైల్‌ యాప్‌లో ఏ విధంగా వివరాలు నమోదు చేయాలో వివరించాలన్నారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ శివరామకృష్ణ, ఏఎంసీ అజ్మీర రాజన్న, ఎంఈ మురళీమోహన్‌రెడ్డి, ఏసీపీ జ్యోత్స్నాదేవి, డీఈఈ హేమలత, ఏఈ రాగవినతి, మాస్టర్‌ ట్రైనర్‌ శ్రీకాంత్‌, టీపీబీఓ అభిషేక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement