ఎస్‌జీఎఫ్‌ క్రికెట్‌ సంబురం | - | Sakshi
Sakshi News home page

ఎస్‌జీఎఫ్‌ క్రికెట్‌ సంబురం

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

నేటినుంచి 69వ జాతీయస్థాయి అండర్‌–17 బాలుర క్రికెట్‌ టోర్నీ

పాల్గొననున్న 31 రాష్ట్రాల జట్లు

ఇప్పటికే జడ్చర్ల చేరుకున్న 28 జట్లు

ఆరు రోజుల పాటు ఐదు మైదానాల్లో మ్యాచ్‌ల నిర్వహణ

వాతావరణం

వాతావరణం ఉదయం కాస్త చల్లబడుతుంది. మధ్యాహ్నం వేడిగా ఉండి ఉక్కపోత పెడుతుంది. సాయంత్రం కొంత ఆహ్లాదంగా ఉంటుంది.

జడ్చర్ల టౌన్‌: పాలమూరు వేదికగా మరోసారి జాతీయ స్థాయి క్రీడాపోటీలు జరగనున్నాయి. జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ కేంద్రాల్లో ఆదివారం నుంచి 69వ ఎస్‌జీఎఫ్‌ జాతీయ అండర్‌–17 బాలుర క్రికెట్‌ టోర్నీ ప్రారంభం కానుంది. మొత్తం 31 జట్లు పాల్గొంటుండగా.. ఇప్పటికే 28 రాష్ట్రాల జట్లు జడ్చర్లకు చేరుకున్నాయి. నేటి ఉదయం వరకు మిగిలిన మూడు జట్లు రానున్నాయి. ఆరు రోజుల పాటు జరిగే ఈ మెగా టోర్నీ కోసం అన్ని ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు, కోచ్‌లకు జడ్చర్ల బస్టాండ్‌, రైల్వేస్టేషన్లలో ఘన స్వాగతం పలికారు. స్వామినారాయణ గురుకుల పాఠశాలలో వీరికి బస ఏర్పాటు చేశారు. జడ్చర్ల మినీ స్టేడియంలో టోర్నీ ప్రారంభం కానుంది. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హాజరుకాన్నారు.

డీఈఓ పరిశీలన..

మెగా టోర్నీ ఏర్పాట్లను డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ పర్యవేక్షించారు. స్వామి నారాయణ గురుకులానికి చేరుకుని ఇతర రాష్ట్రాల క్రీడాకారులతో మాట్లాడారు. వారికి కల్పించిన సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్‌, వసతిపై ఆరా తీశారు. ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్న జడ్చర్ల మినీ స్టేడియాన్ని పరిశీలించారు. ఆయన వెంట టోర్నీ కన్వీనర్‌ మంజులాదేవి, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి శారదబాయి ఉన్నారు.

ఆరోగ్య పరుగు

ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన కల్పించేందుకు జడ్చర్ల పట్టణంలో వచ్చే నెల 3న రన్‌ నిర్వహించనున్నారు.

–8లో u

తెలంగాణ జట్టు

జి.కేతన్‌కుమార్‌, పి.రామ్‌కుమార్‌ చారి, కె.మాన్విత్‌, వెంకటాభిరామ్‌ శ్రీచరణ్‌, ఎం.సిద్దార్థ, అహ్మద్‌ ఆజముద్దీన్‌, సి.సిద్దార్థ, లిఖిత్‌రెడ్డి బైరెడ్డి, మునగాలశెట్టి శాన్‌ విన్సెంట్‌ రాజ్‌, అకరామ్‌ హర్షిత్‌, అజ్మీరా ద్విపద్‌నాయక్‌, డి.అభినవ్‌, కె.సాయితనిక్ష్‌, మహ్మద్‌ అనస్‌, ఎ.దేవశివ్‌త్‌ యాదవ్‌, బి.మణివర్ధన్‌.

నేటి మ్యాచ్‌లు..

జడ్చర్ల మినీ స్టేడియంలో తెలంగాణ వర్సెస్‌ పుదుచ్చేరి, తమిళనాడు వర్సెస్‌ ఎన్‌వీఎస్‌, స్వామినారాయణ గురుకుల మైదానంలో ఆంధ్రప్రదేశ్‌ వర్సెస్‌ కేరళ, యూపీ వర్సెస్‌ ఐబీఎస్‌ఓ, సమర్థ స్కూల్‌ మైదానంలో మధ్యప్రదేశ్‌ వర్సెస్‌ గుజరాత్‌, కర్ణాటక వర్సెస్‌ మహారాష్ట్ర, బీఎస్‌ఆర్‌ మైదానంలో ఉత్తరప్రదేశ్‌ వర్సెస్‌ చత్తీస్‌ఘడ్‌ జట్లు తలపడనున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement