ఆరోగ్యవంతులే.. శ్రీమంతులు | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యవంతులే.. శ్రీమంతులు

Apr 26 2026 2:45 AM | Updated on Apr 26 2026 2:45 AM

ఔషధ గుణాలు కలిగిన దవాచాయ్‌.. గ్రీన్‌ జ్యూస్‌లకు ఆదరణ

వనపర్తి: కరోనా తర్వాత ప్రజల ఆలోచన తీరులో చాలా మార్పు వచ్చిందనడానికి ఆరోగ్యంపై పెరిగిన శ్రద్ధనే ఉదాహరణగా చెప్పవచ్చు. యసిడిక్‌ ఆహారం, పానియాలను తగ్గించి సేంద్రియ ఎరువులతో పండించిన వాటిని తినడం, వందేళ్ల క్రితం నాటి ఆహారపు అలవాట్లను మళ్లీ పునఃప్రారంభించే ప్రయత్నాలు చేస్తూ.. బతికినంత కాలం ఆరోగ్యంగా జీవించే ప్రయత్నం చేస్తున్నారు. కరోనాకు ముందు డబ్బు సంపాదించే వారిని ధనవంతులుగా చెప్పుకొనేవారు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యం కలవారే నిజమేన శ్రీమంతులుగా అభివర్ణించడం విశేషం. మారిన ప్రజల ఆలోచన తీరుకు అనుగుణంగా చద్దన్నం, మిల్లేట్‌ టిఫిన్స్‌, దవాచాయ్‌, గ్రీన్‌ జ్యూస్‌ సెంటర్లు వెలుస్తున్నాయి. శతాబ్దాల నాటి ధన్వంతరి ఆయుర్వేద శాస్త్రంతో అనుబంధం ఉన్న ధాతు ఆయుర్వేదంకు సంబంధించిన డాక్టర్‌ గుమ్మడవెల్లి శ్రీనివాస్‌ సహకారంతో ఉమ్మడి పాలమూరులోని అన్ని జిల్లాకేంద్రాల్లోనూ దవాచాయ్‌ సెంటర్లు వెలిశాయి.

24 మూలికల చూర్ణంతో దవాచాయ్‌ తయారీ

కరోనా తర్వాత ప్రజల్లో ఆరోగ్యంపైపెరిగిన శ్రద్ధ

నిత్యం వాకింగ్‌ తర్వాత తీసుకుంటున్న ఔత్సాహికులు

ధాతు ఆయుర్వేదం సహకారంతోసెంటర్ల ఏర్పాటు

Advertisement
 
Advertisement
Advertisement