తడిసిన మొక్కజొన్న ధాన్యం | - | Sakshi
Sakshi News home page

తడిసిన మొక్కజొన్న ధాన్యం

Apr 25 2026 7:54 AM | Updated on Apr 25 2026 7:54 AM

పెద్దకొత్తపల్లి: మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న మొక్కజొన్న ధాన్యం తడిసింది. కుప్పల చుట్టూ వర్షపు నీరు చేరింది. 12 వేల బస్తాలు కొనుగోలు కేంద్రంలోనే నిల్వ ఉన్నాయి. ఈ బస్తాలను తరలించకపోవడంతో రైతులు ధాన్యం కుప్పల వద్ద లారీల కోసం పడిగాపులు కాస్తున్నారు. అకాల వర్షానికి తడిసిన మొక్కజొన్న ధాన్యం బస్తాలను మళ్ళీ ఆరబెట్టేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

లింగాల: మండలంలో శుక్రవారం సాయంత్రం గంట పాటు గాలి వాన భీభత్సం సృష్టించింది. పలు గ్రామా లలో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. మండలంలోని శాయిన్‌పేటలో జర్పటి సాయిలుకు చెందిన ఇంటి పైకప్పు రేకులు ఎగిరి పడి పోగా ఇంటిలో ఉన్న దుస్తులు, తిండి గింజలు వర్షానికి తడిసి పోయాయి. విద్యుత్తు స్తంభం విరిగిపడింది. భారీ వృక్షాలు నెలకొరిగాయి. పలు మార్గాలలో రోడ్లపై ఆరబోసిన మొక్కజొన్న ధాన్యం తడిసి పోయింది.

Advertisement
 
Advertisement
Advertisement