అంగన్‌వాడీ టీచర్‌తో పాటు హెల్పర్లుగా ఉద్యోగాలకు నియమితులయ్యే వారికి కనీసం ఇంటర్ ఉత్తీర్ణత ఉండాలి. గతంలో అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదో తరగతి ఉత్తీర్ణత ఉండాలన్న నిబంధన ఉండేది. కేంద్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు విద్యార్హతను పెంచింది. ఇకపై కనీసం ఇంటర్మీడియట్ అర్హతగా నిర్ణయించింది. వయోపరిమితి 18 నుంచి 36 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే 65 ఏళ్లు దాటిన తర్వాత వారి సేవలను వినియోగించుకోకూడదు. ఖాళీల్లో 50 శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది.
ప్రతిపాదనలు పంపించాం..
జిల్లాలో అంగన్‌వాడీ టీ చర్లు, ఆయాల పోస్టు ల ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటికే జిల్లా లో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ల స్థానంలో ఇన్‌చార్జిలను ని యమించాం. పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. మంజూ రు అయిన వెంటనే భర్తీ చేస్తాం. – జరీనాబేగం,
జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారి
●


