వెల్దండ: మండల కేంద్ర సమీపంలో యెన్నమ్స్ ఆస్పత్రి సమీపంలో హైదరాబాదు–శ్రీశైలం జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి ఓ కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌కు చెందిన చరణ్‌తేజ్, సాయిసుజన్ రెడ్డి, కిరణ్, హర్షిక్, సల్మాన్‌లు గురువారం రాత్రి కారులో శ్రీశైలం బయలుదేరారు. వెల్దండకు చేరుకోగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ప్రమాదంలో కారు రోడ్డు కిందభాగంలో పడడడంతో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. డ్రైవర్ సాయిసుజన్‌రెడ్డి, కిరణ్, చరన్‌తేజల పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కురుమూర్తి తెలిపారు.


