ఓవర్‌ స్పీడ్‌కు ఇద్దరు బలి | - | Sakshi
Sakshi News home page

ఓవర్‌ స్పీడ్‌కు ఇద్దరు బలి

Apr 24 2026 7:38 AM | Updated on Apr 24 2026 7:38 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: తెల్లవారుజాము.. రోడ్డు నిర్మానుషంగా ఉండటంతో బైక్‌పై అతివేగంగా వెళ్తూ అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొట్టడంతో ఓ యువకుడు స్పాట్‌ డెడ్‌కాగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వన్‌టౌన్‌ ఎస్‌ఐ శీనయ్య కథనం ప్రకారం.. భగీరథ కాలనీకి చెందిన బహద్దూర్‌ శ్రీకర్‌(26), వీరన్నపేటకు చెందిన కుమార్‌(24) ఇద్దరూ ఆన్‌లైన్‌ డెలివరీ బాయ్స్‌గా పని చేస్తుంటారు. గురువారం తెల్లవారుజామున 2గంటల ప్రాంతంలో భగీరథ కాలనీ నుంచి బోయపల్లిగేట్‌లోని కంపెనీ గోదాం వద్దకు బైక్‌పై వెళ్తూ వన్‌టౌన్‌ చౌరస్తాలో వేగంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో శ్రీకర్‌ అక్కడిక్కడే దుర్మరణంపాలయ్యాడు. తీవ్రంగా గాయపడిన కుమార్‌ను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ప్రమాదం మధ్యరాత్రి కావడంతో ఎలాంటి ట్రాఫిక్‌ లేకపోవడంతోపాటు బైక్‌ ఓవర్‌ స్పీడ్‌ ఉండుట, హెల్మెట్‌లు లేకపోవడంతో తలకు గాయాలు కావడంతో ఇద్దరూ మృతిచెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.

● రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది ఇద్దరూ యువకులే.. కుటుంబాలకు ఆసరాగా ఉంటూ డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఈబైక్‌ ప్రమాదంలో ఇద్దరికీ తలలకు తప్పా ఇతర శరీర భాగాల్లో ఎక్కడా పెద్ద గాయాలు లేకపోవడం విశేషం. ప్రమాదం సమయంలో ఇద్దరికి హెల్మెట్‌ ఉంటే ప్రాణాలతో బయటపడే అవకాశం కన్పిస్తోంది. ఇద్దరూ యువకులు మృతితో ఆ రెండు కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది.

అర్ధరాత్రి బైక్‌తో డివైడర్‌ను ఢీకొట్టి ఇద్దరు యువకులు

స్పాట్‌లో ఒకరు.. ఆస్పత్రిలో మరొకరు

హెల్మెట్‌ లేకపోవడం వల్లే మృత్యువాత

Advertisement
 
Advertisement
Advertisement