జాతీయస్థాయిలో ‘తెలంగాణ’ సత్తా | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయిలో ‘తెలంగాణ’ సత్తా

Apr 24 2026 7:38 AM | Updated on Apr 24 2026 7:38 AM

మన్ననూర్‌: అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులోని 5 గ్రామాలకు పునరావాసం కల్పించడంలో భాగంగా నమూనా ప్రజెంటేషన్‌లో తెలంగాణ ప్రతినిధులు సత్తా చాటారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసిన అధ్యక్ష, కార్యదర్శులలో తెలంగాణకు పవర్‌ ప్రజెంటేషన్‌లో ప్రశంసల వెల్లువ లభించింది. కేంద్ర పర్యాటక శాఖ, రాష్ట్ర అటవీ(అరణ్య) శాఖ సంయుక్త ఆధ్వర్యంలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ఈకో టూరిజం సంయుక్త్త పునరావాసం పథకంలో భాగంగా అమ్రాబాద్‌ మండలంలోని సార్లపల్లి, కుడిచింతలబైలు, తాటిగుండాల, కొల్లం, వటువర్లపల్లికి సంబంధించిన అధ్యక్ష, కార్యదర్శులు సీఎం సాయిబాబు, సంబు సంతోష్‌ను ఎంపిక చేసి మధ్యప్రదేశ్‌లోని పన్న టైగర్‌, ఈకో టూరిజం ప్రాజెక్టుకు అటవీశాఖ తరఫున తీసుకెళ్లారు. ఈ క్రమంలో 25రోజులుగా కొనసాగిన అవగాహన కార్యక్రమం గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధి సభ్యులతోపాటు తెలంగాణ తరఫున అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేషన్‌, ఈకో టూరిజం, డిప్లొమా కోర్సుల అంశాలపై ఎన్‌టీసీపీ బృందం సభ్యుల సమక్షంలో కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, వాతావరుణ మార్పుల మంత్రిత్వ శాఖ, డెహ్రడూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఐఐ) నిర్వహించిన ఈ శిక్షణలో అమ్రాబాద్‌ ఈకో టూరిజం అభివృద్ధికి సంబంధిచి పలు అంశాలను తెలియజేశారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రతినిధులు ఇచ్చిన పవర్‌ ప్రజెంటేషన్‌ను (డబ్ల్యూఐఐ) హెడ్‌ డాక్టర్‌ రమేష్‌, కృష్ణమూర్తి, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రమేష్‌ చిన్నస్వామి, కేంద్ర మత్రిత్వ శాఖ సభ్యులు అభినందించారు. ప్రత్యేకించి చెంచు గిరిజనులకు ఉపాధి అవకాశాలు, స్థిరమైన ఆదాయ వనరులు, స్థానిక కళలు, సాంస్కృతిక ప్రోత్సాహం, ప్రకృతి సంరక్షణతో కూడిన అభివృద్ధి ఈ ప్రాంతంలో అందుబాటులోకి రానున్నాయని ఎన్‌టీసీఎ సభ్యులు పునరుద్ఘాటించారు. అదేవిధంగా చివరి ప్రజెంటేషన్లుగా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వులోని 5గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం, అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో పునరావాసం కింద అందజేస్తున్న రెండు ప్యాకేజీలలో భాగంగా మొదటిది రూ.15 లక్షలు నగదు చెల్లింపు, రెండో 5ఎకరాల వ్యవసాయ భూమి, పక్కా ఇండ్లు, కనీస అవసరాల ఏర్పాట్ల కల్పన తదితర అంశాల గురించి చేసిన విశ్లేషణ జాతీయ స్థాయి శాస్త్రవేత్తలను ఆకట్టుకున్నట్లు తెలిపారు. నల్లమల ప్రాంతంలో అటవీశాఖ కల్పిస్తున్న ఈ ప్రత్యేకతలను పరిశీలించేందుకు త్వరలోనే ఉన్నతస్థాయి బృందం అమ్రాబాద్‌ పులుల రక్షిత అభయారణ్యం ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు తెలిపారు. అటవీశాఖ తరఫున ఇలాంటి అవకాశం కల్పించిన డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర, ఎఫ్‌డీఓలు, ఎఫ్‌ఆర్‌ఓలు, సంబంధిత అటవీశాఖ అధికారులు, సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఏటీఆర్‌లోని ఐదు గ్రామాల పునరావాసంపై పవర్‌ ప్రజెంటేషన్‌

ఆకట్టుకున్న తెలంగాణ ప్రతినిధుల విశ్లేషణ

అభినందించిన వైల్డ్‌లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా

Advertisement
 
Advertisement
Advertisement