రాజోళి: వడ్డేపల్లి మండలం జూలకల్ గ్రామంలో మొక్కజొన్న పంట దగ్ధమైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గ్యాంగ్ తిమ్మప్ప మూడు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాడు. అయితే గురువారం షార్ట్ సర్య్యూట్ అయి పంటకు నిప్పంటుకొని పంట మొత్తం కాలి బూడిదైంది. ప్రమాదంలో రూ.2.50లక్షలు నష్టం వాటిల్లినట్లు బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వమే తనను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు.
ట్రాలీ, పశుగ్రాసం దగ్ధం
తిమ్మాజిపేట: మండల పరిధిలోని బావాజిపల్లిలో గురువారం ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ట్రాలీ, పశుగ్రాసం దగ్ధమైన ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. గ్రామానికి చెందిన అబ్దుల్‌నబీ తన పొలంలోని షెడ్డు సమీపంలో ట్రాక్టర్, పశుగ్రాసం(జొన్నసొప్ప)భద్రపరిచాడు. హఠాత్తుగా మంటలు వ్యాపించడంతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేశారు. ప్రమాదంలో సుమారు రూ. 2 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాడు.
కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం
గద్వాల క్రైం: కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదంలో తండ్రి మృతిచెందిన ఘటన గద్వాల పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు.. హట్కార్‌పేటకు చెందిన చంద్రశేఖర్(70) కుమారుడు లోకేష్ మధ్య బుధవారం రాత్రి వివాదం జరిగింది. ప్రమాదవశాత్తు తండ్రిని తోసివేయడంతో సృహ తప్పి కిందపడిపోయాడు. స్థానికులు గమనించి జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరిచారు. మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుమారుడు మద్యానికి బానిసై, ఆర్థిక వ్యవహారాల విషయంలో కుటుంబ సభ్యులతో విభేదాలు నెలకొన్న నేపథ్యంలో తండ్రిపై దాడి చేయడంతోనే మృతి చెంది ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
తండ్రి మృతి


