జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): భగీరథ మహర్షి ఒక గొప్ప తపస్వి అని, ఆయన దీక్ష సంకల్పం, నిస్వార్థ సేవా భావం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఖుష్బూగుప్తా అన్నారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో గురువారం జిల్లాకేంద్రంలో గ్రీన్‌బెల్ట్‌లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వేశారు. సమాజంలో ఉన్న అసమానతలు, అన్యాయాలను తొలగించేందుకు భగీరథుడి అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందని ఆమె పిలుపునిచ్చారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మేయర్ మమత, బీజీ సంక్షేమ శాఖ అధికారి ఇందిరా, సగరసంఘం జిల్లా అధ్యక్షుడు ప్రణీల్‌చందర్ పాల్గొన్నారు.
ఏకపక్షంగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడంతోనే పార్లమెంట్‌లో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిందని ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నగర మేయర్ మమత, డిప్యూటీ మేయర్ సురేందర్‌రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2023లోనే మహిళా బిల్లు ఆమోదం పొందినప్పటికీ బీజేపీ దురుద్దేశంతో 2027 జనగణన తర్వాత అమలు చేస్తామని మోసానికి పాల్పడిందని ఆరోపించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక బృందావన్ ఫంక్షన్ హాలులో రౌండ్‌టేబుల్ సమావేశం జరుగుతుందన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ కోదండరాం, జాన్‌వెస్లీ తదితరులు చర్చాగోష్టిలో పాల్గొంటారన్నారు. దీనికి జిల్లాలోని మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు, ఉద్యోగులు, తెలంగాణ ఉద్యమకారులు తప్పనిసరిగా హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
వేరుశనగ @ రూ.6,461
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్‌లో గురు వారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,461, కనిష్టంగా రూ.4,889 ధరలు లభించాయి. ఆముదాలు గరిష్టంగా రూ. 6,310, జొన్నలు గరిష్టంగా రూ.5,887, హంస గరిష్టంగా రూ.1,869, ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,461, కనిష్టంగా రూ.1,651, కందులు రూ.గరిష్టంగా రూ.6,266, పెబ్బర్లు రూ.6,277 ధరలు లభించాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం గరిష్టంగా రూ.2,113, కనిష్టంగా రూ.1,980, హంస గరిష్టంగా రూ.1,741, కనిష్టంగా రూ.1,719 ధరలు నమోదయ్యాయి.


