25 క్వింటాళ్లే కొంటారంట | - | Sakshi
Sakshi News home page

25 క్వింటాళ్లే కొంటారంట

Apr 24 2026 7:32 AM | Updated on Apr 24 2026 7:32 AM

నాకున్న 9 ఎకరాలలో మొక్కజొన్న సాగు చేస్తే.. ఎకరాకు 30– 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. 20 రోజుల క్రితమే పంట కల్లాల్లో నిల్వ చేశాను. దళారులను ఆశ్రయిస్తే క్వింటా రూ.1,600లకు కొంటారంట. దేవరకద్రలో ప్రారంభించిన కొనుగోలు కేంద్రంలో అమ్ముదామంటే పారంభించారు. అక్కడ అమ్ముకుందామనుకుంటే ఎకరాకు 25 క్వింటాళ్లే కొంటామని అధికారులు చెబుతున్నారు.

– రమేష్‌, రైతు, పర్దీపురం గ్రామం, చిన్నచింతకుంట మండలం

త్వరగా తూకం వేయాలి..

కొనుగోలు కేంద్రం వద్ద తూకాలు ఆలస్యం కావడంతో నాలుగు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను. వాన కురిస్తే మొక్కజొన్నలు తడిచి ఇబ్బంది అవుతుంది. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సకాలంలో తూకాలు వేయాలి.

– రాఘవేందర్‌, రైతు, వాడ్యాల్‌,

మిడ్జిల్‌ మండలం

తడిసిన ధాన్యం కొనాలి..

కొనుగోలు కేంద్రం వద్ద తూకాలు ఆల స్యం కావడంతో రోడ్ల పై పోసిన మొక్కజొన్న కుప్పలు వానకు తడుస్తుంది. కాబట్టి ప్రభు త్వం తడిసిన మొక్కజొన్నను కూడా కొనుగోలు చేసి ఇబ్బందులు లేకుండా చూడాలి.

– ఆంజనేయులు, రైతు, మిడ్జిల్‌

ఎక్కడికక్కడే కొనుగోళ్లు చేపడుతున్నాం..

మొక్కజొన్న రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో 13 చోట్ల మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేశాం. జిల్లాకేంద్రంలోని మార్కెట్‌ యార్డుకు రైతుల తాకిడి ఎక్కువగా ఉంది. రైతులు సమీప ప్రాంతంలోని కొనుగోలు కేంద్రంలో విక్రయించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నాం. – తహమీనా,

జిల్లా మార్క్‌ఫెడ్‌ అధికారి, నాగర్‌కర్నూల్‌

Advertisement
 
Advertisement
Advertisement