శ్రీౖశెలం మల్లన్న దర్శనం కోసం కర్ణాటకలోని యాద్గిర్ నుంచి వచ్చాను. ఉదయం 8 గంటల నుంచి మహబూబ్‌నగర్ బస్టాండ్‌లో వేచి ఉన్నాను. బస్సులు నడుపుతారని కొంతమంది, నడవవు అని మరికొందరు అంటున్నారు. రాత్రి వరకై నా సరే.. బస్సులు నడిస్తే శ్రీశైలం వెళుతాను.
– హనుమంతు, యాద్గిర్ (కర్ణాటక)
సమ్మె విషయం తెలియదు..
ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయం తెలియదు. నారాయణపేట జిల్లాలోని ఓ పుణ్యక్షేత్రానికి వెళ్లాలి. ఉదయం 6 గంటల నుంచి మా తండా నుంచి కల్వకుర్తి వరకు ఆటో, అక్కడి నుంచి జడ్చర్ల, మహబూబ్‌నగర్ వరకు ఆటోల్లో వచ్చాను. తీరా ఇక్కడ వచ్చేసరికి 12 గంటల సమయం అయింది. ఇక్కడ బస్సు కోసం గంటల తరబడి వేచి ఉన్నాను. సాయంత్రం వరకై నా బస్సులు నడుస్తే బాగుంటుంది.
– ముడావత్ కిషన్, దేవతపల్లితండా (డిండి మండలం), నల్లగొండ
●


