‘బ్యాట్‌’ జాయింట్‌ సెక్రెటరీగా రవికుమార్‌ | - | Sakshi
Sakshi News home page

‘బ్యాట్‌’ జాయింట్‌ సెక్రెటరీగా రవికుమార్‌

Apr 23 2026 8:30 AM | Updated on Apr 23 2026 8:30 AM

మహబూబ్‌నగర్‌ క్రీడలు: బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ(బ్యాట్‌) జాయింట్‌ సెక్రెటరీగా మహబూబ్‌నగర్‌కు చెందిన ఎల్‌.రవికుమార్‌ ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో మంగళవారం బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ సర్వసభ్య సమావేశం నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గంలో రవికుమార్‌ జాయింట్‌ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తనపై నమ్మకంతో ఈ పదవి అప్పగించిన రాష్ట్ర అసోసియేషన్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో బ్యాడ్మింటన్‌ క్రీడను మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement