దామరగిద్ద: దేశ రక్షణ, హింధూ ధర్మ సంరక్షణ కోసం ప్రతి హిందువు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ ప్రాంత సామాజిక సమరసత ప్రముఖ్ అప్పాల ప్రసాద్ జీ, ఇస్కాన్ ప్రతినిధులు గీత సంస్కృతి భోదకులు వదరరాజ్ దాస్ ప్రభుజీ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని భవానిమాత ఆలయ ఆవరణలో ఏర్పా టు చేసిన హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన హిందూ సమ్మేళనాకి వారు ముఖ్య వక్తలుగా హాజరై మాట్లాడారు. హిందూ సమాజాన్ని చైతన్యం చేసి సమైక్య భారతదేశాన్ని విశ్వగురువుగా నిర్మాణం చేయాలన్నదే హిందూ ధర్మం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, వీఎచ్‌పీ వంటి సంస్థలు చేపడుతున్న కార్యక్రమాల్లో మనమంత పాలుపంచుకోవాలని సూచించారు. ఏడాది క్రితం ఇదే రోజున జమ్ముకాశ్మీర్‌లోని పహేల్గాం ఉగ్ర దాడిలో మతాన్ని చూసి పర్యాటకులను హతమార్చిన ఘటన మనందరిని కలిచివేసిందన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రమూకలను మట్టుబెడ్డిన ఘనత మన జవాన్‌లకు దక్కిందన్నారు. కుటుంబం కోసం సంతానం ఎంత ముఖ్యమో దేశాన్ని రక్షించడం కోసం ప్రతి ఇంటి నుంచి సైనికులను పంపాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రవీందర్‌నాథ్, హిందే సమ్మేళన సమితి అద్యక్షుడు అశోక్, ఆర్‌ఎస్‌ఎస్ బాధ్యులు సత్యనారాయణరెడ్డి, రాఘవేందర్‌గౌడ్, నాగేందర్‌లు, వెంకట్రాములు, రవికుమార్, మాణిక్ పాల్గొన్నారు.


