వనపర్తి రూరల్: రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేయాలని సోమవారం పెబ్బేరు పట్టణంలోని సుబాష్ చౌరస్తాలో ఇళ్లు కోల్పోయిన బాధితులు శ్రీధర్‌రెడ్డి , వెంకట్రావ్‌జీ, వెంకటేష్, హన్మంతు రెడ్డి, శ్యామ్‌లాల్, చాకలి రాముడు, సీతమ్మ, నరేందర్‌జీ, మోహన్‌లాల్, నర్సిం హ్మ గౌడ్, శ్రీనాథ్, రఫీ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఎంఐఎం మండల అధ్యక్షుడు అప్రోజ్, బీఎస్పీ నేత ఏబీజే సత్యం సాగర్, సీపీఐ నేత పెద్ద ఖాజ, బీసీ పోలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వెంకటన్న గౌడ్ దీక్షలో పాల్గొని మద్దతు తెలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది నుంచి ఆగిన వనపర్తి రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేసి, విస్తరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు లేదా ప్లాట్ కేటాయించి రూ.5 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉన్న రహదారి విస్తరణ పనులు వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలన్నారు. అదే విధంగా చౌరస్తా నుంచి ఇరువైపులా 40 అడుగుల రహదారి నిర్మాణం చేపట్టాలని, రహదారి విస్తరణ ఎక్కువ, తక్కువ లేకుండా బాధితులు అందరూ ఒకటే కాబట్టి ఇష్టం వచ్చినట్లు కాకుండా అంతటా 40 ఫీట్లు ఉండేలా చూడాలని కోరారు. అంబేద్కర్ చౌక్‌లో మహిళలకు, పురుషులకు టాయిలెట్లు నిర్మించాలన్నారు. తమ డిమాండ్లు నెరవేరేంత వరకు దీక్షలు కొనసాగుతాయని వారు చెప్పారు. కార్యక్రమంలో రోడ్డు విస్తరణ భాదితులు పాల్గో న్నారు.


