‘గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి’ | - | Sakshi
Sakshi News home page

‘గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి’

Apr 22 2026 9:30 AM | Updated on Apr 22 2026 9:30 AM

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): భారతీయులు ఆరాధించే గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ఆల్‌ మే వా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు షేక్‌ ఫారుక్‌ హుస్సేన్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్‌ ప్రధాన గేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవును జాతీయ జంతువుగా ప్రకటించి న్యాయం చేయాలని కోరారు. ప్రధానంగా బక్రీద్‌ పండుగ వస్తుందంటేనే మహబూబ్‌నగర్‌ జిల్లాలో గోవులను సంతలో అమ్ముతారని ఆ సంతలో కొనుగోలు చేసిన ఖురేషి తెగవారిపై గోరక్షక దళాల పేరుతో దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై అక్రమ కేసులు బనాయించి వారికి నానా ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం గోవులు సంతలో అమ్మకుండా పటిష్టమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతోపాటు ఖురేషి తెగవారికి రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మొహమ్మద్‌ తక్హుద్దీన్‌, మొహమ్మద్‌ సలీం మహమ్మద్‌ సోహెబ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement