భూసార పరీక్షలతో నేలకు రక్ష | - | Sakshi
Sakshi News home page

భూసార పరీక్షలతో నేలకు రక్ష

Apr 22 2026 9:30 AM | Updated on Apr 22 2026 9:30 AM

ఏ పంటకు ఎంత లోతులో నమూనా తీయాలి?

● వ్యవసాయ పంటలకు 6 అంగుళాలు

● పండల్ల తోటలకు 5 నుంచి 6 అడుగుల వరకు ప్రతి అడుగుకు ఒక నమునా

● చౌడు, ఆమ్ల నేలల్లో అడుగు లోతులో ప్రతి 6 అంగుళాలకు ఒక నమునా తీయాలి.

మట్టి నమునాలు ఎలా

సేకరించాలంటే?

● నేలపై ఉన్న గడ్డి, చెత్త, కలుపు మొక్కలు తీసివేయాలి.

● అగర్‌ లేదా పార ద్వారా

నమునాలు సేకరించాలి.

● పొలంలో ‘వీ’ ఆకారంలో

గోతులు తీయాలి.

● గొయ్యి అంచుల నుంచి పారతో గాని లేదా తాపీతోగాని మట్టిని సేకరించాలి.

● పొలంలో 8 నుంచి 10 స్థలాల నుంచి మట్టిని సేకరించాలి.

● సేకరించిన మట్టిని అంతటిని

కలిపి నేలమీద పరచి దానిని

నాలుగు భాగాలు చేయాలి.

● మూలలకు ఎదురుగా ఉన్న భాగాల మట్టిని తీసుకోని మిగిలిన మట్టిని పారవేయాలి. ఈ విధంగా అరకిలో మట్టి నమునాలు సేకరించాలి.

● అరకిలో మట్టిని గుడ్డ నుంచి లేదా పాలిథీన్‌ సంచిలో నింపి అందులో రైతు పేరు, చిరునామా, సర్వే నంబర్‌, పొలం విస్తీర్ణం, మెట్ట/పల్లం/ఆరుతడి పంటలు, గత మూడు సంవత్సరాల్లో వాడుతున్న ఎరువులు, రాబోయే సీజన్‌లో వేయాల్సిన పంటలు, సేకరించిన తేదీ లాంటి వివరాలు జతయాల్సి ఉంటుంది. సమాచార పత్రంతో కూడిన మట్టి నమూనాలను సంబంధిత భూసార పరీక్ష కేంద్రాలకు పంపాల్సి ఉంటుంది. పైన తెలిపిన జాగ్రత్తలు తీసుకోని పారదర్శకంగా మట్టి నమునాలు పంపితే ప్రయోగశాలలో పరీక్షించిన తర్వాత భూసార పరీక్షల్లో ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి.

అలంపూర్‌ : మనం బతకడానికి ఆధారమైన నేలకు భూసార పరీక్షలు ఎంతో అవసరం. భూమిలో ఉన్న పోషకాలు వాటి లోపాలు తెలుసుకోవడానికి అందుకు అనుగుణంగా పంటలు వేయడానికి తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియానాయక్‌ రైతులకు సూచించారు. భూసార పరీక్షల ద్వారా నేల భౌతిక, రసాయన లక్షణాలు తెలుసుకోనే వీలుంటుందని, రైతులు మట్టి నమునాలు సేకరించే సమయాల్లో తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాలని ఏడీఏ వివరించారు.

భూసార పరీక్ష అంటే?

పొలం నుంచి సేకరించిన మట్టిని ప్రయోగశాలల్లో వివిధ భౌతిక, రసాయనిక పద్ధతుల ద్వారా విశ్లేంషించి వాటి లక్షణాలు తెలుసుకోవడం. అలాగే అందులోని పోషకాలు ఏంటీ, తక్కువగా, మధ్యస్థంగా ఉన్నవి ఏంటీ? వాటి ఫలితాల ఆధారంగా ఏ పంట వేసుకోలో నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. అందుకు ఎంత మోతాదులో ఎరువులు వాడాలో తెలుసుకోవడమే భూసార పరీక్షలుగా పేర్కొన్నారు.

భూసార పరీక్షలతో లాభాలు:

● పొలంలో వివిధ పోషకాల స్థాయి ఎంత వరకు ఉందో తెలస్తోంది.

● ఏ పంట వేయాలో తెలుసుకోనే అవకాశం ఉంటుంది.

● ఎరువులను ఎంత మోతాదులో.. ఎంత వరకు వేసుకోవాలో తెలుస్తుంది.

● నేల సమస్యలు, కారు చౌడు, పాలచౌడు తెలుసుకోని స్థాయి సవరించుకోవచ్చు

● ఎరువుల అనవర ఖర్చు తగ్గించవచ్చు

● పంటసాగులో అధిక దిగుబడి సాధించుకోనే అవకాశం.

మట్టి నమునాలు ఎప్పుడు సేకరించాలి ?

పంట కోత తర్వాత వేసవిలోనూ, పంటలు లేని సమయాల్లో మట్టి నమునాలు జాగ్రత్తగా తీసి పంపాలి.

మట్టి నమునాలు ఎక్కడ తీయకూడదు?

● ఎరువులు వేసిన తర్వాత నెల రోజుల వరకు మట్టి నమునాలు సేకరించకూడదు.

● నీరుపెట్టిన తర్వాత మట్టి నమునాలు సేకరించరాదు.

● నీడ పడే ప్రదేశాల్లో సేకరించరాదు.

● నీటి ముందు ఉన్న ప్రాంతాల్లో సేకరించ కూడదు.

● ఎరువుల కుప్పల వద్ద, గట్లవద్ద, చెట్ల దగ్గర ప్రాంతాల్లో మట్టిని తీయరాదు.

ఎంత విస్తీర్ణానికి మట్టి నమూనా తీయాలి?

● ఒక పొలానికి ఒక నమూనా తీయాలి.

● పొలం విస్తీర్ణం ఎక్కువగా ఉంటే ప్రతి రెండు నుంచి ఐదు ఎకరాలకు ఒక నమూనా తీయాలి.

● నేల నిర్మాణం, రంగు, మురుగు పారుదల సౌకర్యం, నేలవాలు, చౌడు, క్షార, ఆమ్ల గుణాలు, పంటల సరళి తదితర విషయాల్లో తేడాలు కనిపిస్తే అన్ని రకాల నమూనాలు ఆ పొలం నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.

పాడి–పంట

Advertisement
 
Advertisement
Advertisement