మిడ్జిల్: మండలంలోని వేముల పంచాయతీ పరిదిలోని తమ్మడికుంట తండాలో రైతు రవినాయక్ సాగుచేసిన మొక్కజొన్న పంటకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పూర్తిగా దగ్ధమైన ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. తండాకు చెందిన రైతు రవినాయక్ ఐదు ఎకరాల్లో మొక్కజొన్న పంటను సాగుచేశాడు. పంటమొత్తం కోత దశకు రాగా.. సోమవారం ప్రమాదవశాత్తు నిప్పంటుకుంని కాలిబూదదైంది. దాదాపు రూ.4లక్షలు నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. ప్రభుత్వం స్పందించి ఆర్థికంగా ఆదుకోవాలని రైతు కోరారు.
విద్యుదాఘాతంతో దుకాణం దగ్ధం
కోస్గి రూరల్: ప్రమాదవశాత్తు షార్ట్ సర్కూట్‌తో దుకాణం దగ్ధమైన ఘటన పట్టణంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు పట్టణంలోని శివాజీ చౌరస్తాలో నివాసం ఉంటున్న గంగ్జి హరికిషన్ మొబైల్, గడియారాల రిపేర్‌షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఎప్పటిలానే ఆదివారం రాత్రి షాపు బంద్ చేసి ఇంటికి వెళ్లాడు. రాత్రి సమయంలో షాపులోంచి పొగలు రావడంతో చుట్టుపక్కల వారు యజమానికి సమాచారం అందించారు. తెరిచే చూసే సరికి షాపులోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. వీటి విలువ రూ.5 లక్షల వరకు ఉంటుందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాల్‌రాజ్ తెలిపారు.


