అచ్చంపేట: అగ్నిమాపక వారోత్సవాల నిర్వహణ భేష్ అని భూగర్భ కేంద్రం సీఈ సత్యనారాయణ అన్నారు. టీజీ జెన్‌కో పరిధిలోని శ్రీశైలం భూగర్భ విద్యుత్ కేంద్రంలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలను వారం రోజుల పాటు కేంద్రం వద్ద, ఈగలపెంట, దోమలపెంటలో సంతృప్తికరంగా నిర్వహించారని స్టేషన్ ఫైర్ సిబ్బంది, స్టేఫ్టీ ఇంజినీర్లను అభినందించారు. వారోత్సవాలు ముగింపు సందర్భంగా కేంద్రంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో సీఈ మాట్లాడారు. భూగర్భ కేంద్రం భద్రతకు సేఫ్టీ ఇంజినీర్లు, ఫైర్ సిబ్బంది ఎల్లవేళల అప్రమత్తతతో విధులు నిర్వహిస్తూ కేంద్రాన్ని కంటికి రెప్పలా కాపాడాలన్నారు. సేఫ్టీ డీఈ శ్రీకుమార్‌గౌడ్, ఏడీఈ రాము, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ మల్లికార్జునను ప్రశంసించారు. భూగర్భ కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలను అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించడం సంతృప్తి కల్గించిందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఈ(ఓఅండ్‌ఎం)ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.


