మహబూబ్‌నగర్ క్రీడలు: ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవ్ క్రీడాపోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. మండల, నియోజకవర్గస్థాయిల్లో పూర్తయిన క్రీడాపోటీలు జిల్లాకేంద్రంలోని మెయిన్ స్టేడియంలో సోమవారం నుంచి పార్లమెంట్ స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు బాలురకు క్రికెట్, బాలబాలికలకు వాలీబాల్ పోటీలు నిర్వహించారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల క్రీడా జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. క్రికెట్‌లో మహబూబ్‌నగర్, నారాయణపేట, జడ్చర్ల, కొడంగల్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకున్నాయి. బాలికల విభాగం వాలీబాల్ పోటీల్లో పార్లమెంట్ స్థాయిలో మక్తల్ జట్టు విజేతగా, దేవరకద్ర జట్టు రన్నరప్‌గా నిలిచాయి. మంగళవారం కబడ్డీ, ఖోఖో పోటీలతో పాటు క్రికెట్ పోటీలు జరగనున్నాయి. కార్యక్రమంలో సంసద్ ఖేల్ మహోత్సవ్ పార్లమెంట్ ఇన్‌చార్జి ముచ్చర్ల జనార్దన్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లా కన్వీనర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇన్‌చార్జి నవీన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


