మక్తల్‌ ఆరో వారు్డలో బీజేపీ విజయం | - | Sakshi
Sakshi News home page

మక్తల్‌ ఆరో వారు్డలో బీజేపీ విజయం

Apr 22 2026 9:24 AM | Updated on Apr 22 2026 9:24 AM

మక్తల్‌: నారాయటపేట జిల్లా మక్తల్‌ మున్సిపాలిటీ ఆరోవార్డు కౌన్సిలర్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎర్కలి సత్యమ్మ విజయం సాధించారు. ఫిబ్రవరి 11న పోలింగ్‌ జరగాల్సి ఉండగా.. బీజేపీ అభ్యర్థి ఎర్కలి మహదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో పోలింగ్‌ వాయిదా పడింది. శనివారం పోలింగ్‌ నిర్వహించి.. సోమవారం ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న ఎర్కలి మహదేవప్ప బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె తన సమీప ప్రత్యర్థి ఎర్కలి మార్పైపె 37 ఓట్ల మెజారీతో విజయం సాధించారు. మొత్తం 1,453 ఓట్లకు 1,294 పోల్‌ అయ్యాయి. ఇందులో బీజేపీ అభ్యర్థి సత్యమ్మకు 628 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి మారెప్పకు 591 ఓట్లు, బీఆర్‌ఎస్‌కు 46, నోటాకు 4, ఓటర్లు వచ్చాయి. 25ఓట్లు చెల్లలేదని ఎన్నికల అధికారులు తెలిపారు.గెలుపొందిన అభ్యర్థి సత్యమ్మకు ధ్రువీకరణ పత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement