ఆర్టీసీ సమ్మెకు కార్మికులందరూ సిద్ధం | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ సమ్మెకు కార్మికులందరూ సిద్ధం

Apr 22 2026 9:24 AM | Updated on Apr 22 2026 9:24 AM

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: ఈనెల 22 ఉదయం మొదటి బస్సు నుంచి మొదలయ్యే ఆర్టీసీ నిరవధిక సమ్మెకు కార్మికులందరం సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు జి.లక్ష్మణ్‌గౌడ్‌, విజయబాబు, సాయిరెడ్డి అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్‌ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులతో కలిసి వారు సమ్మె సన్నాహక పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని జేఏసీ నాయకులు పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించినా లెక్క చేయలేదన్నారు. విధిలేని పక్షంలో తాము సమ్మెబాట పట్టామని, ప్రజలు, వివిధ సంఘాలు, మేధావులు తమకు సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బసప్ప, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement