వనపర్తి జిల్లాకు కొత్తగా మూడు యూనిట్లతో పాటు వనపర్తి జనరల్ ఆస్పత్రికి మరో రెండు పడకలు అదనంగా మంజూరయ్యాయి. కొ త్తగా వచ్చిన రేవల్లి, వీపనగండ్ల, ఖిల్లాఘనపురంలో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం, విద్యుత్, నీళ్లు ఇలా వసతులపై పరిశీలించి.. ఎంత ఖర్చు అవుతుంది.. ఇతర అంశాలపై ప్రత్యేక రిపోర్ట్ తయారు చేసి ఈ నెల చివరి నాటికి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. త్వరలో పనులు ప్రారంభించి.. అందుబాటులోకి తీసుకువచ్చేలా చూస్తాం.
– సాయినాథ్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ, వనపర్తి
వైద్యుడిని సంప్రదించాలి..
కిడ్నీ సమస్య ఉన్నవారిలో మొదట నీరసం, ఆకలి మందగించడం, మూత్రం తక్కువగా రా వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారు వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. అ యితే నాణ్యతతో కూడిన డయాలసిస్ చేసుకోకపోవడం వల్ల సమస్య పరిష్కారం కావడం లేదు. హెచ్‌డీఎఫ్ కానీ హెచ్‌వోఎంఎల్, హెచ్ డీ, నాచ్యురల్ హెచ్‌బీ చేస్తే ఫలితం మెరుగైన స్థితిలో ఉంటుంది. – డాక్టర్ శంకర్, నెఫ్రాలజిస్టు


