ఉమ్మడి జిల్లాలో రోగులు ఇలా.. | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి జిల్లాలో రోగులు ఇలా..

Apr 22 2026 9:24 AM | Updated on Apr 22 2026 9:24 AM

కొత్తగా 11 డయాలసిస్‌ కేంద్రాలు మంజూరు

ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 12 చోట్ల సేవలు

నూతన యూనిట్లతో రోగులకు మరింత ఊరట

మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకువచ్చేలా కసరత్తు

పాలమూరువ్యాప్తంగా 908 మంది బాధితులు

మహబూబ్‌నగర్‌

361

నాగర్‌కర్నూల్‌

184

జోగుళాంబ గద్వాల

162

వనపర్తి 110

పాలమూరు: ఉమ్మడి జిల్లాలో పలు కారణాలతో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో డయాలసిస్‌ కేంద్రాలు ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీలో భాగంగా తెల్లరేషన్‌ కార్డు కలిగిన బాధితులకు ఉచితంగా సేవలు అందిస్తోంది. అయితే ఉమ్మడి పాలమూరులో సరిపడా డయాలసిస్‌ కేంద్రాలు లేక రోగులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోగుల ఇబ్బందులను దూరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 11 డయాలసిస్‌ కేంద్రాలను మంజూరు చేసింది. 11 కేంద్రాల్లో 55 పడకలతో సేవలు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. పబ్లిక్‌– ప్రైవేట్‌ భాగస్వామ్యం విధానంలో వీటిని నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

నారాయణపేట 91

Advertisement
 
Advertisement
Advertisement