కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలి

Apr 22 2026 9:24 AM | Updated on Apr 22 2026 9:24 AM

దేవరకద్ర: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మద్దతు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించాలని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి పేర్కొన్నారు. మక్కలకు మద్దతు ధర రూ.2400 ప్రకటించి కొనుగోలు చేయాలని నిర్ణయించిందని.. ఇందుకు మొదటిసారిగా దేవరకద్ర మార్కెట్‌ యార్డులో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. సోమవారం దేవరకద్ర మార్కెట్‌ యార్డులో పీఏసీసీఎస్‌ ఆధ్వర్యంలో వరితో పాటు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ మద్దతు ధరతో పాటు సన్నాలకు రూ.500 బోనస్‌ లభిస్తుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు ఇథనాల్‌ ఫ్యాక్టరీని దూరంగా తరలించాలని బీఆర్‌ఎస్‌ చేస్తున్న రాద్ధాంతంపై స్పందిస్తూ.. ఇంటిగ్రేటెడ్‌ స్కూలును అక్కడి నుంచి తరలించే ప్రసక్తి లేదని.. నిజంగా కాలుష్యం ఏర్పడితే ఫ్యాక్టరీనే ఈ ప్రాంతం నుంచి తరలిస్తామని వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఇథనాల్‌ ఫ్యాక్టరీని తెచ్చింది.. ఫ్యాక్టరీ ఓనర్‌ బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు పార్థసారథిరెడ్డి అని తెలిపారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూలు వస్తే ఇథనాల్‌ కంపెనీ తరలించే అవకాశం ఉందని భావించిన స్థానిక మాజీ ఎమ్మెల్యే ఆ కంపెనీతో కుమ్మకై ్క అభిప్రాయ సేకరణ పేర నాటాకాలకు తెరలేపారని విమర్శించారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ కతలప్ప, ఎంపీడీఓ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ దీపిక, వ్యవసాయ అధికారి రాజేందర్‌ అగర్వాల్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దమయంతి, వైస్‌ చైర్మన్‌ యుగంధర్‌రెడ్డి, టీపీసీసీ సెక్రటరీ అరవింద్‌రెడ్డి, మండలాధ్యక్షుడు అంజిల్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement