మహిళా బిల్లుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు | - | Sakshi
Sakshi News home page

మహిళా బిల్లుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు

Apr 22 2026 7:36 AM | Updated on Apr 22 2026 7:36 AM

పాలమూరు: వచ్చే 2029ఎ న్నికల్లో మహిళలకు చట్ట సభలలో 33 శాతం రిజర్వేషన్‌ అందించాలనే ఉద్దేశంతో బిల్లు ప్రవేశపెడితే కాంగ్రెస్‌, మిత్ర పక్షాలు వ్యతిరేకించాయని, మహిళల సంక్షేమాన్ని వీరు అడ్డుకున్నారని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్లతో ఆమె మాట్లాడారు. మొదటి నుంచి కాంగ్రెస్‌ పార్టీ మహిళ రిజర్వేషన్‌ బిల్లు అడ్డుకుంటూనే ఉందని, ఎన్నికల వేళ మహిళల రిజర్వేషన్‌పై మట్లాడటం, తర్వాత తూట్లు పొడవడం అనాధిగా కొనసాగుతుందన్నారు. మహిళ రిజర్వేషన్‌కు కాంగ్రెస్‌, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ పార్టీలు కుంటిసాకులు చెబుతూ వ్యతిరేకిస్తున్నట్లు ఆరోపించారు. డీలిమిటేషన్‌ జనాభా ప్రకారం జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయనే భావాన్ని వ్యక్తం చేసినప్పుడు పరిగణలోకి తీసుకుని ఏ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా 50 శాతం సీట్లు పెంపు ప్రతిపాదన చేశారన్నారు. 17 స్థానాలు ఉన్న తెలంగాణలో మరో 9 స్థానాలు పెంచితే 26 స్థానాలకు పెరిగే అవకాశం ఉండేదని తెలిపారు. కేంద్రం సమతుల్యమైన ఫార్ములా తీసుకొస్తే దేశాన్ని విభజించే తీరుగా దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం అనే భావన కూటమి పార్టీలు తీసుకువచ్చారని విమర్శించారు. ఈనెల 24న మహబూబ్‌నగర్‌లో జరగనున్న ప్రధానమంత్రి సంసద్‌ ఖేల్‌ మహోత్సవ్‌ ముగింపు వేడుకకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా హాజరవుతారని తెలిపారు. ఆత్మకూర్‌, కొత్తపల్లి బ్రిడ్జి వ్యతిరేకించడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నేతలు అంజయ్య, సత్యం, కృష్ణవర్ధన్‌రెడ్డి, బాల్‌రెడ్డి, మర్రి జ్యోతి, పద్మావేణి, హరికృష్ణ పాల్గొన్నారు.

● మహబూబ్‌నగర్‌ నగరంలోని మదీనా మజీద్‌, కొత్త గంజి ఏరియాలో రైల్వే అధికారులతో కలిసి రైల్వే డబ్లింగ్‌ పనులను ఎంపీ డీకే అరుణ పరిశీలించారు. పనులు త్వరగా పూర్తి చేసి స్థానికుల ఇబ్బందులు పరిష్కరించాలని రైల్వే అధికారులకు సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement