ఆర్టీసీ పరిరక్షణ కోసమే తప్పని పరిస్థితుల్లో సమ్మె చేస్తున్నాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన వాటినే పరిష్కరించమని కోరుతున్నాం. 2021 పేస్కేల్ అమలు చేస్తామని చెప్పి ఇంత వరకు నెరవేర్చలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చెల్లిస్తామన్న హామీని మరిచారు. ట్రేడ్ యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేసి పునరుద్ధరించి వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు జరపాలి.
– జి.లక్ష్మణ్‌గౌడ్,
ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు
కార్మికుల సమస్యల పరిష్కరించాలి
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. సంస్థ ను కాపాడు కునే లక్ష్యంతోనే సమ్మె చేస్తున్నాం. ఆర్టీసీ ఉద్యోగులపై పనిభారం తగ్గించాలి. రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలి.
– విజయ్‌బాబు, ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకుడు


