పట్టించుకోవడం లేదు.. | - | Sakshi
Sakshi News home page

పట్టించుకోవడం లేదు..

Apr 20 2026 9:11 AM | Updated on Apr 20 2026 9:11 AM

పట్టించుకోవడం లేదు.. ప్రభుత్వం దృష్టికి..

పరిశ్రమల నుంచి వెలువడిన వ్యర్థాలను లెదర్‌ పార్కుకు కేటాయించిన స్థలంలో డంప్‌ చేస్తున్నారు. దీంతో వ్యర్థాలతో ఈ ప్రాంతం నిండిపోయింది. వ్యర్థాలను తగులబెట్టడంతో వస్తున్న పొగ పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుంది. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వ్యర్థాల పారబోతపై విచారించి చర్యలు చేపట్టాలి.

– కృష్ణయ్య, మాచారం

పరిశ్రమల వ్యర్థాల సమస్యను అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి మరోసారి తీసకెళ్తాం. ఇప్పటికే వ్యర్థాల పారబోతపై సంబంధిత పరిశ్రమలకు హెచ్చరికలు జారీచేశాం. సమస్యను సంబంధిత మంత్రి కొండా సురేఖ దృష్టికి కూడా తీసుకెళ్లాం. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ప్రాంతం రెడ్‌ కేటగిరీలోకి వెళ్లే ప్రమాదం ఉంది.

– అనిరుధ్‌రెడ్డి, ఎమ్మెల్యే, జడ్చర్ల

Advertisement
 
Advertisement
Advertisement