500 బస్తాల రేషన్‌ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

500 బస్తాల రేషన్‌ పట్టివేత

Apr 19 2026 8:05 AM | Updated on Apr 19 2026 8:05 AM

గత్ప శివారు పొలాల్లో రాష్ట్ర విజెలెన్స్‌ అధికారుల దాడి

స్టాక్‌ పాయింట్‌కు బియ్యం తరలింపు

దామరగిద్ద: అక్రమంగా నిల్వ ఉంచిన 500 బస్తాలకు పైగా పీడీఎస్‌ బియ్యం శనివారం రాష్ట్ర విజిలెన్స్‌ అధికారులు నిర్వహించిన దాడుల్లో పట్టుబడ్డాయి. స్టేట్‌ విజిలెన్స్‌ సీఐ గణేశ్‌, డీసీఓపీ సురేష్‌ బృందం నిర్వహించిన దాడిలో మండలంలోని గత్ప శివారులోని పొలాల్లో శిథిలావస్థలో ఉన్న ఇంటిని అంతారం గ్రామానికి చెందిన వెంకటేశ్‌ అద్దెకు తీసుకొని బియ్యం నిల్వ చేసినట్లు గుర్తించారు. అదే విధంగా అక్కడే ఉన్న డీసీఎం వాహనంలో నాలుగు బస్తాల పీడీఎస్‌ బియ్యాన్ని గుర్తించారు. సదరు వ్యక్తి బియ్యాన్ని ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచినట్లు ఆధారాలు సేకరించారు. సీజ్‌ చేసిన బియ్యం బస్తాలను అదే డీసీఎంలో స్టాక్‌ పాయింట్‌కు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుబడిని పీడీఎస్‌ రైస్‌, డీసీఎంను సీజ్‌ చేసి 6ఏ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఐ శివశంకర్‌, ఎస్‌ఐ రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement