గాలీవాన బీభత్సం.. అపార నష్టం | - | Sakshi
Sakshi News home page

గాలీవాన బీభత్సం.. అపార నష్టం

Apr 19 2026 8:05 AM | Updated on Apr 19 2026 8:05 AM

నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు, వృక్షాలు

రాకపోకలకు తీవ్ర అంతరాయం

బల్మూర్‌: గాలీవాన బీభత్సంలో రోడ్లపై భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు కూలి పడగా, మామిడి కాయలు నేలరాలి అపార నష్టాన్ని మిగిల్చింది. మండలంలోని బల్మూర్‌, వీరంరాజ్‌పల్లి, కొండనాగుల, రామాజిపల్లి, సితారాంపూర్‌, గోదల్‌ తదితర గ్రామాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా గాలివాన దూమారం రేగడంతో బల్మూర్‌లోని బస్టాండ్‌ వద్ద మూడు విద్యుత్‌ స్తంభాలు, కొండనాగుల వద్ద భారీ వృక్షాలు విరిగి రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సుమారు వంద ఎకరాల మామిడితోటల్లో కోత దశకు వచ్చిన మామిడి కాయలు రాలిపోగా, మొక్కజొన్న పంట నేలకొరిగి తీవ్రనష్ట్రం వాటిల్లడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పండ్లు నేలరాలాయి

రెండు రోజుల్లో మామిడి కాయలు కోసి విక్రయించాలని కూలీలను మాట్లాడుకున్నా. కానీ ప్రకృతి విలయంతో గాలివానకు తోటలోని మామిడి కాయలన్నీ నేలరాలి నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ఆదుకోవాలి.

– అంబటిపల్లి రాములు, మామిడి తోటరైతు, వీరంరాజుపల్లి

Advertisement
 
Advertisement
Advertisement