మెట్టుగడ్డ: ఎండాకాలంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నరకం.. డబ్బులు తీసుకుంటారు కానీ.. వసతులు మాత్రం కల్పించరు. ఇది మహబూబ్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో దుస్థితి. క్రయవిక్రయదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో దస్తావేజు రిజిస్ట్రేషన్‌కు వినియోగదారుడి నుంచి ప్రభుత్వం రూ.500 యూజర్ ఛార్జీ వసూలు చేస్తారు. ఇలా వసూలు చేసిన డబ్బుతో వినియోగదారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలి. కానీ పాలమూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గొంతు తడిపే దిక్కులేదు. ఎండలు మండుతున్నా కనీసం ప్రజలకు ఫ్యాన్లు కూడా పెట్టించలేని స్థితిలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఉంది. వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ సౌకర్యం కూడా లేదు. వినియోగదారుల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని పరిస్థితిలో కార్యాలయం నడుస్తోంది. క్రయవిక్రయాల ద్వారా ఆదాయాన్ని అర్జించే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వసతుల కల్పన మాత్రం తన బాధ్యత కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది. కాలకృత్యాలు తీర్చుకునేందుకు మరుగుదొడ్లు కూడా కేవలం ఒక్కటే ఉంది. మహిళలతై నరకం అనుభవిస్తున్నారు. కార్యాలయం బాగా ఇరుకుగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు మేల్కొని తగిన వసతులు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో తాగేనీరు లేదు.. ఫ్యాన్లు లేవు
తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రయవిక్రయదారులు
ఇరుకై న కార్యాలయంతో ప్రజలకు ఇక్కట్లు


