సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలి

Apr 19 2026 7:59 AM | Updated on Apr 19 2026 7:59 AM

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ‘ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళికశ్రీలో భాగంగా ఈనెల 20 నుంచి 26వ తేదీ వరకు నిర్వహించే సంక్షేమ వారోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్‌ ఖుష్బూ గుప్తా అన్నారు. శనివారం ఈ కార్యక్రమంపై హైదరాబాద్‌ నుంచి సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి సీఎస్‌ రామకృష్ణారావు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. అనంతరం కలెక్టరేట్‌లో వీసీ ద్వారా మండల స్థాయి అధికారులకు ఆమె పలు సూచనలు చేశారు. ఈ వారోత్సవాలకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా కార్యక్రమాల బ్యానర్లను తప్పకుండా ప్రదర్శించాలన్నారు. ముఖ్యంగా పేరెంట్స్‌ మీటింగ్‌ల సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు కల్పించిన సౌకర్యాలపై తల్లిదండ్రులకు వివరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు హరిప్రియ, మధుసూదన్‌నాయక్‌, సీపీఓ రవీందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement