మక్తల్: పట్టణంలోని 6వ వార్డు ఎన్నికలు శనివారం జరగనున్నాయి. గతంలో బీజేపీ మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థి మహదేవప్ప మృతి చెందడంతో 6 వార్డు ఎన్నికలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారులు నేడు ఎన్నికలు నిర్వహించనున్నారు. 6వ వార్డులో మొత్తం 1452 మంది ఓటర్లు ఉన్నారని , వీరిలో పురుషులు 728 మంది, మహిళలు 725 మంది, పోలింగ్ సిబ్బంది 25 మంది ఉన్నారు. ఇక బీజేపీ మద్దతుతో సత్యమ్మ, కాంగ్రెస్ మద్దతుతో మారెప్ప, బీఆర్‌ఎస్ తరఫున మొగులప్ప బరిలో నిలిచారు. పోలింగ్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ ఫణింద్రర్‌రెడ్డి పోలింగ్ బూత్‌లను సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అవుతుందని ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
చందపూర్‌లో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన అడిషనల్ కలెక్టర్ ఫణిందర్‌రెడ్డి


