జూనియర్‌ న్యాయవాదులకు శిక్షణ అందించాలి | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ న్యాయవాదులకు శిక్షణ అందించాలి

Apr 18 2026 7:53 AM | Updated on Apr 18 2026 7:53 AM

పాలమూరు: హైదరాబాద్‌లోని హైకోర్టు ఆవరణలో జిల్లా బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం హైకోర్టు న్యాయమూర్తి శ్రావణ్‌కుమార్‌ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టు నూతన భవన నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. మే నెలలో దేవరకద్ర జూనియర్‌ సివిల్‌ కోర్టు ప్రారంభం అవుతుందని, జూనియర్‌ న్యాయవాదులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి వారిని ప్రోత్సాహించాలని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు. ఆ తర్వాత నూతన కమిటీ హైకోర్టు న్యాయమూర్తులు లక్ష్మణ్‌, మాధవి దేవి, నర్సింగ్‌రావును మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కోర్టు వార్షికోత్సవానికి రావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో జిల్లా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆనంద్‌రావు, ప్రధాన కార్యదర్శి నర్సింహారెడ్డి, ఉపాధ్యక్షుడు వెంకటయ్య, కోశాధికారి రాజుగౌడ్‌, సభ్యులు సబిత, ధనలక్ష్మి, శశిబాబు పాల్గొన్నారు.

పోగొట్టుకున్న బంగారు పుస్తెలు తిరిగి అందజేత

యాదగిరిగుట్ట: యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన భక్తురాలు పోగొట్టుకున్న బంగారు నల్లపూసల పుస్తెలను ఎస్‌పీఎఫ్‌ పోలీసులు గుర్తించి తిరిగి ఆమెకు అందజేశారు. ఎస్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ శేషగిరిరావు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట జిల్లా గొర్లనోనిబావికి చెందిన కావలి మంగమ్మ తన కుటుంబసభ్యులతో కలిసి యాదగిరీశుడిని దర్శించుకునేందుకు శుక్రవారం వచ్చింది. స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్న సమయంలో ఆమె బంగారు నల్లపూసల పుస్తెలు పోగొట్టుకుంది. వెంటనే మంగమ్మ సమీపంలోని ఎస్‌పీఎఫ్‌ సిబ్బందికి, ఆలయ సిబ్బందికి ఫిర్యాదు చేయగా.. ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది సీసీ కెమెరాల సాయంతో పుస్తెలు దొరికిన వ్యక్తులను గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ ఈఓ నవీన్‌కుమార్‌, ఎస్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. శేషగిరిరావు, ఎస్‌ఐ సీహెచ్‌. రవి సమక్షంలో మంగమ్మకు బంగారు పుస్తెలు అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement