కురుమూర్తి గుట్టకు భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

కురుమూర్తి గుట్టకు భక్తుల రద్దీ

Apr 18 2026 7:53 AM | Updated on Apr 18 2026 7:53 AM

చిన్నచింతకుంట: పేదల తిరుపతిగా పేరుగాంచిన అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయం అమావాస్య సందర్భంగా శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి పాలమూర్‌ జిల్లా నుంచి స్వామివారి దర్శనానికి ఉదయం నుంచే వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. కోనేరులో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూలైన్‌లో నిల్చున్నారు. అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు, వ్రతాలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ చేశారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాటు చేసినట్లు ఆలయ ఈఓ మధనేశ్వరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement