పరిశ్రమల కాలుష్యంపై జిల్లా అధికారిక యంత్రాంగం సీరియస్‌గా వ్యవహరించిన క్రమంలో హైదరాబాద్‌లోని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల్లో కదలిక వచ్చింది. అప్పటివరకు నామమాత్రపు తనిఖీలకే పరిమితమైన వారు వర్షాకాలంలో పలుమార్లు స్వయంగా పర్యటించారు. ఆ తర్వాత మూడేళ్లలో పరిస్థితి తారుమరైనట్లు తెలుస్తోంది. జిల్లాస్థాయిలో వచ్చిన ఫిర్యాదులు చెత్తబుట్టలకే పరిమితం కాగా.. పీసీబీ ఆడిందే ఆటగా మారినట్లు తెలుస్తోంది. ఆధారాలతో సహా అందజేసినా.. కనీసం శాంపిళ్ల సేకరణకూ రాకపోవడంతో ఫిర్యాదుదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమల నుంచి నెలనెలా అందుతున్న మామూళ్లతోనే వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రస్తుత కలెక్టర్ అయినా తమ గోడును పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బీఓఎస్ (బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్) పరీక్ష సైతం చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పోలేపల్లి సెజ్‌లోని ఓ పరిశ్రమ చిమ్నీ నుంచి బయటికి వదులుతున్న నల్లటి కాలుష్యం


