కట్టుదిట్టమైన చర్యలు చేపడుతాం
తాడూరు: చెట్టు..పుట్ట..గుట్ట.. మట్టి కాదేది కాసుల దందాకు అడ్డురా అడ్డు కాదు.., ఇసుక, మట్టి స్థలాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ అక్రమార్కులు గద్దల్లా వాలిపోతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా తాడురు మండల కేంద్రం శివారులో ఉన్న కొమ్ముగుట్టను కొల్లగొడుతున్నారు. అధికారులు చూసీచూడనట్లు మాముల్ల మత్తులో మునిగిపోయారు. వారు పట్టించుకోకపోవడంతో కొంగుటురు రేఖల్ని కొల్పోతుంది. 80ఎకరాల్లో విస్తరించిన ఈ గుట్ట చుట్టూ మూడువైపులా మట్టిని తరలించేందుకు జిల్లా కేంద్రానికి దగ్గరగా కొమ్ముకుంట ఉండడంతో మట్టిదందా ఎక్కువ అవుతుండడంతో ఇది కరిగిపోతుంది. ఒక్క టిప్పర్ మట్టిని రూ.4500కు అమ్మెస్తున్నారు. ఇప్పటికే 10ఎకరాల వరకు తవ్వేశారు. తవ్విన ఆ తర్వాత ఖాళీ స్థలం కూడా అక్రమించేందుకు ప్రయాత్నాలు మమ్మురం చేస్తున్నారు. ఎంత తీశారా అనే దానిపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోపాటు మైనింగ్ రెవెన్యూ అధికారులు ఒక్కరోజు కూడా పర్యవేక్షించింది లేదంటున్నారు. రాత్రివేళ మట్టి తరలింపుపై విచారణ చేస్తామని నిఘా పెట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని ఇటు రెవెన్యూ అటు పోలీసు అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం వరకు సరిపోయింది తప్పా.. ఆచరణలో అధికారులు విఫలమయ్యారు. అర్ధరాత్రి అక్రమ రవాణా హద్దూఅదుపు లేకుండా రాత్రి 11గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని ఎండబెట్లలో ప్రైవేట్ స్థలంలో నిల్వ చేసుకొని ఆ తర్వాత డంపింగ్ చేస్తున్నారు. బిజినేపల్లి మండలం లింగాసానిపల్లికి చెందిన ఓ వ్యక్తి అధికారులకు మాములు ఇస్తున్నామనే ధీమాతో మట్టిని తరలిస్తూ గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
మండల కేంద్రంలోని కొమ్ముగుట్ట నుంచి అక్రమంగా మట్టిని యథేచ్ఛగా తరలిస్తున్న టిప్పర్లను గ్రామానికి చెందిన యువకులను పోలీసులకు అప్పజెప్పిన వదిలేస్తున్నారు. 100కు డయల్ చేసి విషయాన్ని తెలిపినా సకాలంలో పోలీసులు స్పందించడం లేదు. ప్రతిరోజు రాత్రి 11గంటల నుంచి తెల్లవారు జామున 5గంటల వరకు అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. మండలనానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి అక్రమ రవాణాను సాగించడంపై అంతర్యం ఏమిటని యువకులు ప్రశ్నిస్తున్నారు.
గుట్టుచప్పుడు లేని దోపిడీ
ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న అక్రమార్కులను పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశ్యం మైనింగ్, పోలీసు, రెవెన్యూ అధికారుల్లో కనబడడం లేదు. 80 ఎకరాలలో విస్తరించి ఉన్నా.. పూర్తిగా మాయమైపోతుంది. మట్టిని తరలించగా ఏర్పడే ఖాళీ స్థలం కూడా కబ్జా చేస్తున్నారు. లక్షల్లో కాసుల దందా కొనసాగుతుంది. అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోతే తప్పని పరిస్థితుల్లో ఆందోళన చేపడతామని ప్రజలు హెచ్చరించారు.
గుట్టుగా మట్టి అక్రమ రవాణా
మామూళ్ల మత్తులో
అధికార యంత్రాంగం
అర్ధరాత్రి నుంచి తెల్లవారేవరకు
ఎండబెట్లలో నిల్వ
కొమ్ముగుట్ట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిపై నిఘా ఏర్పాటు చేసి పోలీసు, మైనింగ్ అధికారులతో చర్చించి కట్టుదిట్టమైన చర్యలు చేపడుతాం
– రామకృష్ణయ్య, తహసీల్దార్, తాడూరు


