మన్ననూర్: స్థానిక వేణుగోపాలస్వామి ఆల యం ముందు భాగంలో ఉన్న కోనేరులో(బావి) ప్రమాదవశాత్తు పడి యువకుడు మృతిచెందిన ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. ఎండి జాహంగీర్ (35) మూడురోజుల క్రితం చేపల వేటకై సమీపంలో ఉన్న కోనేరులోకి ఒక్కడుగా వెళ్లి గాలాలు వేసి కూర్చున్నాడు. మృతుడు అ నునిత్యం తరచుగా మద్యం సేవిస్తూ మత్తులో నే ఉంటాడు. గాలం వేసి ఒడ్డుపైన కూర్చుండగా.. ప్రమాదవశాత్తు తూలి కోనేరులో పడి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం కుళ్లు పడవేసేందుకు వెళ్లిన వారికి కోనేరులో మృతదేహం తేలియాడుతూ కనిపించింది. దీంతో అమ్రాబాద్ పోలీసులకు సమాచారం తెలియజేశారు. సర్పంచ్ సమక్షంలో కోనేరు నుంచి మృతదేహాన్ని వెలికి తీసి పో స్టుమార్టం నిమిత్తం అమ్రాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య హసీన, ఇద్దరు పిల్ల లు ఉన్నప్పటికీ వారు కలిసి ఉండటం లేదు.ఇంట్లో కలిసి ఉండే అమ్మమ్మ నెలక్రితం మృతిచెందడంతో జహంగీర్ ఒక్కడే ఉండేవాడు.ఘటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అమ్రాబాద్ ఎస్‌ఐ హన్మంత్‌రెడ్డి తెలిపారు.
నీటిసంపులో పడి
వాచ్‌మన్ మృతి
వెల్దండ: మండలంలోని పెద్దాపూర్ సమీపంలోని వ్యవసాయ పొలంలోని నీటిసంపులో ప్రమాదవశాత్తు పడి వాచ్‌మన్ మృతిచెందిన ఘటన చోటుచేసుకంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాదుకు చెందిన శ్రీరాములు పెద్దాపూర్ సమీపంలోని వ్యవసాయ పొలంలో జామతోట పెంచుతున్నాడు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండల కేంద్రంలోని పద్మశాలీ కాలనీకి చెందిన బొక్క శ్రీనివాస్(58) జామతోట వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రోజువారీగా పనిచేస్తూ సోమవారం తోటలో ఉన్నాడు. సాయంత్రం నుంచి వాచ్‌మెన్ శ్రీనివాస్ కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ తెలియలేదు. మంగళవారం సాయంత్రం 6గంటల సమయంలో వ్యవసాయ పొలంలోని నీటిసంపులో శ్రీనివాస్ మృతదేహం కనిపించింది. వెంటనే వెల్దండ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి ఎస్‌ఐ కురుమూర్తి చేరుకోని మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య వెంకటమ్మతోపాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
బల్మూర్: మండలంలోని పోలిశెట్టిపల్లి శివారులోని జీఎస్‌ఎన్ కాలేజీ సమీపంలో మంగళవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం గుర్తించినట్లు ఎస్‌ఐ రాజేందర్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 70 ఏళ్లు ఉంటాయన్నారు. అతడు యాచకుడిగా జీవనోపాధి పొందుతున్నాడని అనుమానిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


