రాష్ట్రస్థాయి ‘అథ్లెటిక్స్‌’లో పాలమూరుకు పతకాలు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ‘అథ్లెటిక్స్‌’లో పాలమూరుకు పతకాలు

Apr 15 2026 8:56 AM | Updated on Apr 15 2026 8:56 AM

డి.శ్రీధర్‌

(కాంస్య పతకం)

కీర్తన (రెండు

బంగారు పతకాలు)

పౌర్ణమి

(వెండి పతకం)

కార్తీక్‌

(వెండి పతకం)

బి.శ్రీధర్‌

(బంగారు పతకం)

మహబూబ్‌నగర్‌ క్రీడలు: హనుమకొండలో ఈనెల 11, 12 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి 20 ఏళ్లలోపు బాలబాలికలు, పురుషులు, మహిళల అథ్లెటిక్స్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభచాటారు. జిల్లా అథ్లెట్లు మూడు బంగారు, రెండు రజత ఒక కాంస్య పతాకాన్ని సాధించారు. 20 ఏళ్లలోపు బాలుర విభాగంలో బి.శ్రీధర్‌ 400 మీటర్ల హార్డిల్స్‌లో బంగారు పతకం, బాలికల విభాగంలో కీర్తన 800 మీటర్ల పరుగు, 1500 మీటర్ల పరుగులో బంగారు పతకాలు, కార్తీక్‌ డెకథ్లాన్‌లో వెండి పతకం సాధించారు. అదేవిధంగా 20 ఏళ్ల లోపు బాలికల విభాగంలో బి.పౌర్ణమి డిస్కస్‌త్రోలో వెండి పతకం, డి.శ్రీధర్‌ 400 మీటర్ల పరుగులో కాంస్య పతకాన్ని సాధించారు. పతకాలు సాధించిన జిల్లా క్రీడాకారులను జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టోనీ మార్టిన్‌, జి.శరత్‌చంద్ర, సభ్యులు సి.శ్రీనివాసులు, రాజు, పి.శ్రీనివాసులు, దత్తాత్రేయ, కోచ్‌లు ఆనంద్‌కుమార్‌, సునీల్‌, ఎం.శ్రీనివాసులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement