ట్రాక్టర్‌, బైక్‌ ఢీ : వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌, బైక్‌ ఢీ : వ్యక్తి మృతి

Apr 13 2026 7:50 AM | Updated on Apr 13 2026 7:50 AM

అమరచింత/నర్వ: మండలంలోని బెక్కర్‌పల్లి సమీపంలో ట్రాక్టర్‌, బైక్‌ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అమరచింత మండలం పామిరెడ్డిపల్లికి చెందిన పూలవ్యాపారి వెంకట్‌రెడ్డి (42) అమరచింత నుంచి పెద్దకడ్మూర్‌ వైపు బైక్‌పై వెళ్తుండగా.. మక్తల్‌ మండలం సత్యవార్‌ నుంచి ఇటుక లోడ్‌తో వస్తున్న ట్రాక్టర్‌ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంకట్‌రెడ్డిని స్థానికులు ఆత్మకూర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతిచెందాడు. మృతుడికి బార్య పద్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement