మహబూబ్‌నగర్ క్రీడలు:. జిల్లా కేంద్రంలో జరుగుతున్న ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవాన్ని శుక్రవారం ఎంపీ డీకే అరుణ పరిశీలించారు. స్థానిక మెయిన్ స్టేడియంలో రెండోరోజు ప్రధానమంత్రి సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా టాస్ వేసి క్రీడాపోటీలను ఆమె ప్రారంభించారు. బ్యాటింగ్ చేసి క్రీడాకారులతో సరాదాగా క్రికెట్ ఆడారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లు, టీషర్టులను పంపిణీ చేశారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లో రెండో రోజు క్రికెట్, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పద్మజారెడ్డి, పీఎంఎస్‌కేఎం మహబూబ్‌నగర్ కన్వీనర్ కిరణ్‌కుమార్‌రెడ్డి, బంగ్లా లక్ష్మీకాంత్‌రెడ్డి, కృష్ణవర్ధన్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


